గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్, కంట్రీ డైరెక్టర్ (పబ్లిక్ సెక్టార్ అండ్ ఎడ్ టెక్) ఆశిష్, వారి బృందాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ డిల్లీలో కలిశారు.
ఈ సందర్భంగా విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేయబోయే డేటా సిటీకి సంబంధించి చర్చించారు. ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన అనుమతులు, భూ కేటాయింపులు, పాలసీని త్వరితగతిన ఇస్తామని, ఇందుకోసం ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు చురుగ్గా పని చేస్తోందని చెప్పారు. డేటా సిటీ ఏర్పాటును కంపెనీ తరపున వేగవంతం చేయాలని, దీనివల్ల విశాఖ ఐటి ముఖచిత్రం మారుతుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
AIలో ప్రపంచ స్థాయి అప్లికేషన్ లను రూపొందించడానికి, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుకు గూగుల్ డేటా సిటీ గేమ్ ఛేంజర్ కానుందన్నారు. డేటా సిటీ పనుల వేగవంతానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు గూగుల్ క్లౌడ్ ఎండి.