నెల్లూరులో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

నెల్లూరులోని బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డులో తెల్లవారుజామున 5గంటల సమయంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నెల్లూరు వైపు నుంచి బిట్రగుంట స్టేషన్ యార్డులోకి నెమ్మదిగా వస్తున్న సమయంలో క్రాసింగ్ వద్ద రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటీన సంఘటన స్థలికి చేరుకొని మరమ్మతలుచేపట్టారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ వైపు వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. బిట్రగుంట రైల్వే స్టేషన్‌కు దక్షిణం వైపు ఉన్న 144వ లెవల్ క్రాసింగ్ గేటు వద్ద గూడ్స్ ఫార్మేషన్ ఆగడంతో రోడ్ ట్రాఫిక్ ఏర్పడింది.

సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అత్యవసర రైళ్లను మూడో లైన్‌లోకి పంపించాలని అధికారులు నిర్ణయించారు. వీటితోపాటు మిగిలిన రైళ్లకు కూడా అంత‌రాయం లేకుండా అధికారులు తగు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌వైపు వెళ్లే ప‌లు రైళ్లు ఆల‌స్యంగా న‌డ‌వ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. కొద్ది గంట‌ల స‌మ‌యంలో రైళ్ల రాక‌పోక‌లు యాథావిధిగా ఉంటాయ‌ని అధికారుల సూచించారు.