ap ration shop

ఏపీలో రేషన్​కార్డుదారులకు గుడ్​న్యూస్​ ..

ఏపీలో రేషన్​కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్ లో నిత్యావసర ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రేషన్​ దుకాణాల్లో నేటి (అక్టోబర్​ 11) నుంచి నెల ఆఖరు వరకు పామోలిన్‌ లీటరు (850 గ్రాములు) రూ.110, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లీటరు (910 గ్రాములు) రూ.124 చొప్పున విక్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

ఒక్కో రేషన్‌ కార్డుపై 3 లీటర్ల పామోలిన్, ఒక లీటరు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ చొప్పున నిర్ణయించిన ధరలపై అందించనున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో వంటనూనెల సరఫరాదారులు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ధరల నియంత్రణపై వారితో చర్చించారు. ఇండోనేసియా, మలేసియా, ఉక్రెయిన్‌ నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు పన్నులు, ప్యాకేజి ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు మంత్రికి వివరించారు.

Related Posts
నితీష్-నవీన్‌కు భారతరత్న?
నితీష్-నవీన్‌కు భారతరత్న?

నితీష్-నవీన్‌కు భారతరత్న: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న Read more

జేఈఈ అడ్వాన్స్డ్: సుప్రీంకోర్టు తీర్పు
జేఈఈ అడ్వాన్స్డ్: సుప్రీంకోర్టు తీర్పు

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (అడ్వాన్స్డ్) కోసం ప్రయత్నాల సంఖ్యను మూడు నుండి రెండుకు తగ్గించే నిర్ణయాన్ని సవాలు చేసిన విద్యార్థులకు సుప్రీంకోర్టు శుక్రవారం ఉపశమనం కలిగించింది. నవంబర్ Read more

సీఎంని కలిసిన తర్వాత దిల్ రాజు వ్యాఖ్యలు
సీఎంని కలిసిన తర్వాత దిల్ రాజు వ్యాఖ్యలు

‘సంక్రాంతి సినిమాలు, టిక్కెట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఇప్పుడు ముఖ్యం కాదు’: దిల్ రాజు తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులు గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని Read more

సాగు భూములకు మాత్రమే రైతు భరోసా: సీఎం
సాగు భూములకు మాత్రమే రైతు భరోసా: సీఎం

రైతు భరోసా పథకం కేవలం సాగు భూములకు మాత్రమే వర్తించేలా చర్యలు తీసుకోవాలని, నాలా మార్పిడి భూములు, మైనింగ్, గోడౌన్లు, మరియు వివిధ ప్రయోజనాల కోసం సేకరించిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *