మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..టైమింగ్ మారింది

హైదరాబాద్లో మెట్రో రైళ్లు ఇకపై ఉ.5.30 గంటల నుంచే ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. నగరంలో ఎన్ని Flyovers కట్టిన ట్రాఫిక్ మాత్రం కంట్రోల్ కావడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న జనాభా , వాహనాల సంఖ్యతో నగరవాసులు ట్రాఫిక్ లో నరకం చూపిస్తున్నారు. అయితే మెట్రో ప్రయాణం చాలామంది హమ్మయ్య అనుకుంటున్నారు. కాకపోతే ఉదయం 7 గంటల నంచి 11 గంటల వరకు మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉండడంతో.. తెల్లవారు జామున ప్రయాణం చేసేవారికి ఇబ్బందులు తలెత్తుతుండడంతో మెట్రో ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది మెట్రో సంస్థ.

ఇక నుంచి ఉదయం 5.30 గంటల నుంచి మెట్రోను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తెల్లవారు జామున షిఫ్టుల్లో ఉద్యోగాలు చేసేవారు, చిరు వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఉదయం 5.30 గంటలకు గత శుక్రవారం ప్రయోగాత్మకంగా రైళ్లు నడపగా.. మంచి స్పందన వచ్చింది. దీంతో ఇక నుంచి 5.30 గంటలకే మెట్రో సేవలు అందుబాటులోకి తెచ్చేదుకు సిద్దమైంది. ప్రయాణికు బాగోగులే తమకు ముఖ్యమని.. ట్రాఫిక్ రద్దీ కూడా బాగా తగ్గుతుందని తెలిపారు. గత కొంత కాలంగా ప్రయాణికుల నుంచి దీనిపై విజ్ఞప్తులు వస్తున్నాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వివరించింది.