శ్రావణ శుక్రవారం ఎఫెక్ట్..భారీగా పెరిగిన బంగారం ధరలు

శ్రవణం మాసం ప్రారంభం కావడం తో పసిడి ధర కొండెక్కుతుందని అంత భావించారు. కానీ పసిడి ధర మాత్రం భారీగా తగ్గుతుండడం తో పసిడి కొనుగోలు చేయాలనుకునే వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ బంగారం కొనుగోలు చేస్తున్నారు. గత 15 రోజులుగా బంగారం తగ్గుతూ వస్తుండగా..ఈరోజు మాత్రం కాస్త పెరిగింది.

నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.750, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.820 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (ఆగష్టు 9) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,250గా.. 24 క్యారెట్ల ధర రూ.70,090గా నమోదయింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూస్తే..

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,250గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,090గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.64,440 పలకగా.. 24 క్యారెట్ల ధర రూ.70,240గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.70,090గా ఉంది.