పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

శ్రవణం మాసం ప్రారంభం కావడం తో పసిడి ధర కొండెక్కుతుందని అంత భావించారు. కానీ పసిడి ధర మాత్రం భారీగా తగ్గుతుండడం తో పసిడి కొనుగోలు చేయాలనుకునే వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ బంగారం కొనుగోలు చేస్తున్నారు. గత 15 రోజులుగా బంగారం తగ్గుతూ వస్తుండగా..ఈరోజు భారీగా తగ్గింది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.870 తగ్గి రూ.69,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.800 తగ్గి రూ.63,900గా నమోదైంది. సిల్వర్ రేట్ కేజీపై ఏకంగా రూ.3,200 తగ్గి రూ.82,500కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.