ఏంటీ ధర చూసి అవాక్కయ్యారా? ఇది మామూలు మేక కాదు మరి. అసాధారణమైన పొడవాటి చెవులు వంటి ప్రత్యేక లక్షణాలకు ఈ మేక ప్రసిద్ధి చెందింది. దీని విక్రయం కోసం సౌదీ అరేబియాలో ప్రత్యేకంగా వేలం నిర్వహించగా ఔత్సాహికులు ఆకర్షితులై పోటీపడ్డారు. సౌదీ అరేబియాలో నిర్వహించిన ప్రత్యేక వేలంలో ఈ మేకకు భారీ డిమాండ్ ఏర్పడింది. వేలంలో పాల్గొన్న పలువురు ఈ మేకను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. ఈ వేలంలో ఒక సౌదీ వ్యక్తి 60,000 సౌదీ రియాలు (భారత రూపాయల కంటే రూ.13.74 లక్షలు) పెట్టి ఈ మేకను సొంతం చేసుకున్నాడు.
ఈ మేక ప్రత్యేకతే దీనికి అంతటి భారీ ధరకు కారణమైంది. పొడవాటి చెవులు, అందమైన రూపు, అరుదైన జాతికి చెందినదని చెప్పబడే ఈ మేక అసాధారణంగా ఉండటంతో చాలా మంది దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నారు. ఈ మేక ప్రత్యేకతల కారణంగా ఇది అంతకంటే ఎక్కువ ధరకు కూడా వెళుతుందని ఊహించారు. వేలంలో కొనుగోలు అనంతరం మేకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ మేకను చూస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘ఇది మామూలు మేక కాదు, బంగారం అని అనిపిస్తోంది’ అంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త వైరల్ అవడంతో ప్రత్యేక జాతి మేకలపై ప్రజలలో ఆసక్తి పెరిగింది. ఇలాంటి మేకల పెంపకం, వాటి సంరక్షణపై చర్చలు ప్రారంభమయ్యాయి.