2026లో స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ క్రీడలలో కొన్ని ప్రధాన ఆటలను తొలగిస్తూ కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఈ కొత్త మార్పుల కారణంగా బ్యాడ్మింటన్ హాకీ క్రికెట్ స్క్వాష్ రెజ్లింగ్ టేబుల్ టెన్నిస్ రోడ్ రేసింగ్ నెట్ బాల్ షూటింగ్ వంటి ముఖ్యమైన ఈవెంట్లను తొలగించనున్నారు ఇది చాలా మంది క్రీడాకారులకు వారి అభిమానులకు నిరాశ కలిగించే విషయం కామన్వెల్త్ క్రీడల చరిత్రలో ఈ క్రీడలకు విశేష ప్రాధాన్యం ఉంది ఈ క్రీడల్లో భారతదేశం లాంటి దేశాలు మేటి ప్రదర్శనలు కనబరచి పతకాలను సాధించడం సాధారణమైపోయింది 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత విజయాలు సాధించారు ఆ సారి భారతం మొత్తం 61 పతకాలు సాధించగా అందులో 22 గోల్డ్ 16 సిల్వర్ 23 బ్రాంజ్ పతకాలు ఉన్నాయి ఈ అద్భుత ప్రదర్శనతో భారతదేశం పతకాల పట్టికలో నాల్గవ స్థానంలో నిలిచింది.
కామన్వెల్త్ క్రీడల ఫెడరేషన్ ఈ సారి ఖర్చును తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది 2022లో 19 ఈవెంట్లు నిర్వహించినప్పటికీ 2026 గేమ్స్‌లో కేవలం 10 ఈవెంట్లకు మాత్రమే పరిమితమయ్యారు ఇది వివిధ క్రీడా సమూహాల నుండి విమర్శలకు దారి తీస్తుంది ఎందుకంటే ఈ మార్పులు చాలా మంది క్రీడాకారులకు పోటీపడే అవకాశాలను తగ్గించేస్తాయి అయితే దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే పలువురు క్రీడాకారులు క్రీడా ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా బ్యాడ్మింటన్ హాకీ స్క్వాష్ వంటి ఆటలు ఎక్కువ మంది అభిమానులను కలిగి ఉండగా ఈ ఆటల తొలగింపుపై నిరసనలు పెరుగుతూనే ఉన్నాయి భారత క్రీడాకారులకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా భావించవచ్చు ఎందుకంటే ఈ ఆటలలో భారత్ తరచూ పతకాలను సొంతం చేసుకుంటుంది 2026 కామన్వెల్త్ క్రీడలపై ఈ మార్పులు ఎంత ప్రభావం చూపుతాయో చూడాలి.