చేజారిన గౌతమ్ అదానీ రూ.8,500 కోట్ల ప్రాజెక్ట్

చేజారిన గౌతమ్ అదానీ రూ.8,500 కోట్ల ప్రాజెక్ట్

భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని దేశాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. అనూహ్యంగా ఆయనను టార్గెట్ చేసిన హిండెన్ బర్గ్ తన వ్యాపార కార్యకలాపాలను క్లోజ్ చేయగా.. ఇటీవల అమెరికా ప్రభుత్వం చేపడుతున్న దర్యాప్తు చేస్తున్న లంచాల కేసుకు సంబంధించిన చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. ఈ క్రమంలో అదానీ గ్రూప్ నేతృత్వంలోని అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ శ్రీలంక కేంద్రంగా చేపట్టాలని గతంలో నిర్ణయించిన రెండు పవర్ ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది. ఇదే విషయాన్ని కంపెనీ శ్రీలంక ప్రభుత్వ సంస్థకు తాజాగా పంపిన లేఖలో వెల్లడించింది. ఈ నిర్ణయంతో కంపెనీ ఏకంగా బిలియన్ డాలర్ల విలువైన విండ్ ఎనర్జీ ప్రాజెక్టు నుంచి పక్కకు తప్పుకోవటం గమనార్హం. పర్యావరణ అనుమతుల్లో జాప్యం, సుప్రీంకోర్టులో ప్రాజెక్టుపై కేసు వంటి కారణాలతో ప్రాజెక్టును రద్దు చేసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Advertisements
చేజారిన  గౌతమ్ అదానీ రూ.8,500 కోట్ల ప్రాజెక్ట్

గౌరవపూర్వకంగా తప్పుకోవాలని..
అయితే ఈ ప్రాజెక్టు రద్దును నివారించటానికి ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను తిరిగి చర్చించడానికి మరో క్యాబినెట్ నియమించిన చర్చల కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ ఏర్పాటు చేయబడతాయని అదానీ గ్రీన్ ఎనర్జీ ఒక ప్రకటనలో పేర్కొంది. లంక సార్వభౌమ హక్కులను గౌరవిస్తూ.. ప్రాజెక్టు నుంచి గౌరవపూర్వకంగా తప్పుకోవాలని నిర్ణయించినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది.

ఈ ప్రాజెక్టు కోసం కంపెనీ దాదాపుగా 5 మిలియన్ డాలర్లను ఖర్చు

దీని కింద గతంలో కుదుర్చుకున్న ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు, విండ్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు కదలక మునుపే శ్రీలంకలో నిలిచిపోనున్నాయని తెలుస్తోంది. దాదాపు అన్ని అనుమతులు పొందటం చివరి దశలో ఉన్న తరుణంలో కంపెనీ ప్రాజెక్టు నుంచి వెనక్కి తగ్గాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం కంపెనీ దాదాపుగా 5 మిలియన్ డాలర్లను ఖర్చు కూడా చేసింది. గతంలో జరిగిన ఒప్పందం కింద అదానీ గ్రూప్ శ్రీలంక ఇంధన మౌలిక సదుపాయాలకు మద్దతుగా 220 KV, 400 KV పవర్ ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ విస్తరణతో పాటు, మన్నార్ పూనెరిన్‌లలో 484 మెగావాట్ల విండ్ ఎనర్జీ కేంద్రాలను స్థాపించాల్సి ఉంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ మన్నార్ ప్రాంతంలో పర్యావరణ అనుమతుల్లో జాప్య, హైకోర్టులో కొనసాగుతున్న కేసుతో ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని అదానీ నిర్ణయించారు.

Related Posts
అదానీ వివాదంపై యుఎస్ నుండి భారతదేశానికి ఎలాంటి సమాచారం లేదు.
Gautam Adani

భారతదేశం, అదానీ గ్రూప్ మరియు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మధ్య న్యాయ వ్యవహారంపై ఇప్పటివరకు యుఎస్ నుండి ఎలాంటి కమ్యూనికేషన్ అందుకోలేదని విదేశీ వ్యవహారాల Read more

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
Manmohan Singh dies

మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణలను భారతదేశంలో తీసుకువచ్చిన మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1991 నుంచి 1996 వరకు అప్పటి Read more

పగ తీర్చుకుంటా: షేక్ హసీనా
Revenge: Former Prime Minister

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లను వదలబోనంటూ వార్నింగ్ ఇచ్చారు. చరిత్ర ఏదీ మర్చిపోదని తప్పక ప్రతీకారం Read more

నేడు నేతాజీ గౌరవార్థం పరాక్రమ దినోత్సవం
నేడు నేతాజీ గౌరవార్థం పరాక్రమ దినోత్సవం1

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా, ఆయన వారసత్వాన్ని గౌరవించేందుకు కటక్‌లోని నేతాజీ జన్మస్థలంలో మూడు రోజుల ప్రత్యేక కార్యక్రమం జనవరి 23న ప్రారంభమవుతుంది. ఈ Read more

×