వరంగల్ లో దారుణం.. బీరు తాగించి సామూహిక అత్యాచారం..!

gang rape on pharmacy stude 1

వరంగల్ లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నగర శివారులోని ఓ ప్రైవేట్​ కళాశాలలో ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని హాస్టల్ లో ఉంటోంది. గత నెల 15న యువతికి పరిచయం ఉన్న యువకుడు మాట్లాడాలని కారులో ఎక్కించుకున్నాడు. అప్పటికే అందులో ఉన్న మరో ఇద్దరు యువకులు ఉన్నారని తాను రానని చెప్పినా బలవంతంగా తీసుకెళ్లాడు. వరంగల్‌ కూరగాయల మార్కెట్ సమీపంలోని ఓయో లాడ్జ్ కి తీసుకెళ్లి అక్కడ యువతికి బలవంతంగా మద్యం తాగించి సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు భయంతో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు.

ఇటీవల పరీక్షలు ముగియడంతో ఇంటికెళ్లిన బాధితురాలు ఇంట్లో వారికి ఈ విషయం చెప్పింది. మంగళవారం తల్లితో కలిసి వరంగల్‌ పోలీసు కమిషనర్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. కమిషనర్ సూచనల మేరకు మంగళవారం ఇంతేజార్‌గంజ్‌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఇంతెజార్ గంజ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు చెప్పిన వివరాలను అనుసరించి ఆమెను నిర్బంధించిన కూరగాయల మార్కెట్ సమీపంలోని లాడ్జిలో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అక్కడ ప్రధాన నిందితుడు ఇచ్చిన ఆధార్ కార్డ్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.

ఆధార్ సాయంతో బాధితురాలి మిత్రుడితో పాటు ఇంకొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరిది భూపాలపల్లిగా గుర్తించారు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మూడో నిందితుడిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Retirement from test cricket. But іѕ іt juѕt an асt ?. Us military airlifts nonessential staff from embassy in haiti.