ఏపీలో మరో దారుణం

భర్తను చితక్కొట్టి, అతని భార్యపై ముగ్గురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఏలూరులో సంచలనంగా మారింది. జీవనోపాధి కోసం వచ్చి రామకోటిలో ఉంటున్న ఈ జంటకు జులాయిగా తిరిగే ఈ యువకులు పరిచయమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి మహిళ భర్తతో కలిసి మద్యం సేవించిన ఉన్మాదులు అతడిపై దాడి చేసి, భార్యను కొద్ది దూరం లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.