'Game changer' police instr

గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్..

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కలయికలో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్‘. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ నిన్న జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

తొలిరోజు ఈ మూవీ రూ.47.13 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు హిందూస్థాన్ టైమ్స్ పేర్కొంది. తెలుగులో రూ.38 కోట్లు, హిందీలో రూ.7 కోట్లు, తమిళ్ రూ.2 కోట్లు వసూలు చేసినట్లు తెలిపింది. మార్నింగ్ షోల్లో 55.82%, మ్యాట్నీలో 39.33%, ఈవెనింగ్ షోల్లో 50.53% ఆక్యుపెన్సీ నమోదు చేసిందని వెల్లడించింది. సినిమా లో సాంగ్స్ మైనస్ గా ఉండడం , స్టోరీ కూడా పాత స్టోరీ లగే అనిపిస్తుండడం , సాగదీత సన్నివేశాలు సినిమాకు మైనస్ అవ్వడం వల్ల మిక్స్డ్ టాక్ వస్తుంది. ఈ సినిమా కోసం దిల్ రాజు భారీ ఖర్చే పెట్టాడు. మరి అవన్నీ వస్తాయా అంటే కష్టమే అని అంటున్నారు సినీ విశ్లేషకులు.

Related Posts
‘ఓజి’ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్
OG update

గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రీసెంట్‌గా ఆగిపోయిన తన సినిమాల షూటింగ్లను తిరిగి మొదలుపెట్టిన విషయం తెలిసిందే. Read more

గద్దర్ కూతురికి కీలక పదవి కట్టబెట్టిన రేవంత్ సర్కార్
vennela

గద్దర్‌ కూతురు డాక్టర్‌ గుమ్మడి వెన్నెలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా నియమిస్తూ.. ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు Read more

Chandrababu: 27వ తేదీన పోలవరం సందర్శించనున్న చంద్రబాబు
Chandrababu: 27వ తేదీన పోలవరం సందర్శించనున్న చంద్రబాబు

ఏలూరు/ పోలవరం ప్రభాతవార్త: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఈనెల 27వ తేదీన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పరిశీలన చేసేందుకు విచ్చేయుచున్న దృష్ట్యా ముఖ్యమంత్రి పర్యటనా Read more

Akbaruddin : విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్యం : అక్బరుద్దీన్ ఆగ్రహం
Akbaruddin విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్యం అక్బరుద్దీన్ ఆగ్రహం

Akbaruddin : విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్యం : అక్బరుద్దీన్ ఆగ్రహం తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో అమలైన "మన ఊరు - మన బడి" కార్యక్రమంపై Read more