Freedom Healthy Cooking Oils to Honor Winners of 'Go for Freedom Gold Offer 2024' Bumper Draw

‘గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్ 2024’

హైదరాబాద్‌ : దేశంలోని ప్రముఖ వంట నూనెల బ్రాండ్ అయిన ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్, తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ కోసం ‘గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్’ బంపర్ డ్రా విజేతలను ప్రకటించింది. ప్రతి రాష్ట్రం నుండి ఒక అదృష్ట విజేత 50 గ్రాముల బంగారు నాణెం అందుకున్నారు. అలాగే ప్రతి రాష్ట్రం నుండి ఇద్దరు విజేతలకు 10 గ్రాముల బంగారు నాణెం లభిస్తోంది. బ్రాండ్ నిర్వహించే స్వచ్ఛత మరియు నాణ్యతా ప్రమాణాలను వీక్షించడానికి ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ ఫ్యాక్టరీని సందర్శించిన ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి, ఇటీవలి ‘ఫ్రీడమ్ కోర్ట్‌రూమ్ క్యాంపెయిన్’లో న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఆయనే అదృష్టవంతులైన విజేతలకు అవార్డులను అందజేశారు.

పండుగ సీజన్‌లో కస్టమర్లతో సన్నిహితంగా ఉండటానికి ‘గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్ 2024’ అనే ప్రమోషనల్ స్కీమ్‌ను ప్రారంభించారు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కవర్ చేసింది. ఈ ప్రాంతాలలో 100 మంది వినియోగదారులు రోజుకు 1 గ్రాము బంగారం గెలుచుకున్నారు మరియు బంపర్ డ్రాలో పాల్గొనే అవకాశాన్ని కూడా పొందారు. ‘గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్ 2024’లో పాల్గొనడానికి వినియోగదారులు ఈ మార్కెట్లలో రెండు 1-లీటర్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ పౌచ్‌లను కొనుగోలు చేయాల్సి వచ్చింది.

image

ఈ పథకానికి అన్ని రాష్ట్రాల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ పథకంలో భాగంగా ఐదుగురు అదృష్టవంతులైన విజేతలు (ప్రతి రాష్ట్రం నుండి ఒకరు ) 50 గ్రాముల బంగారు నాణెంను, 10 మంది విజేతలు (ప్రతి రాష్ట్రం నుండి ఇద్దరు ) 10 గ్రాముల బంగారు నాణెంను అందుకుంటారు. రాష్ట్రాల అంతటా మొత్తం 5500 మంది అదృష్టవంతులైన విజేతలు ఒక గ్రాము బంగారు నాణెంను అందుకున్నారు. విజేతల జాబితాను www.freedomconsumeroffer.com వెబ్‌సైట్‌లో కూడా ప్రచురించారు. ‘గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్ 2024’ యొక్క సాంకేతిక భాగస్వామి గా పైన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరించింది. వారు భారతదేశంలో పాయింట్-ఆఫ్-సేల్ మరియు చెల్లింపు పరిష్కారాల యొక్క ప్రదాతగా ఆధిపత్యం చూపుతున్నారు, వ్యాపార పర్యావరణ వ్యవస్థ అంతటా విస్తృతంగా విస్తరించారు.

జెమిని ఎడిబుల్స్ & ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ & మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ పి. చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ, “ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్‌ వద్ద , మేము నాణ్యమైన మరియు సురక్షితమైన ఉత్పత్తులను అందించడం కంటే ఎక్కువగా , కార్యకలాపాలు నిర్వహించే భౌగోళిక ప్రాంతాలలో ‘గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్ 2024’ వంటి ప్రత్యేకమైన ప్రమోషనల్ పథకాల ద్వారా మా వినియోగదారులకు మరింత ఆనందం కలిగించాలనే ప్రయత్నాలు ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాము. ఈ ఆఫర్ ప్రజలలో ఆనందాన్ని వ్యాపింపజేసింది. ఈ పథకం సమయంలో విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులు బహుమతులు అందుకున్నందుకు మేము సంతోషంగా ఉన్నాము. అదృష్టవంతులైన విజేతలందరినీ మేము అభినందిస్తున్నాము మరియు పథకంలో పాల్గొని దీనిని గొప్ప విజయాన్ని అందించిన కస్టమర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము” అని అన్నారు.

దీనికి తోడు, ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ మార్కెటింగ్ జీఎం శ్రీ చేతన్ పింపాల్ఖుటే మాట్లాడుతూ, “పోషకాలు సమృద్ధిగా ఉండటమే కాకుండా గుండె ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే నూనెలను అందించడం ద్వారా ఆరోగ్యకరమైన వంట అలవాట్లను ప్రేరేపించడమే మా లక్ష్యం. ఈ పండుగ సీజన్‌కు ఉత్సాహాన్ని జోడించడానికి మరియు మా అభిమానులకు బహుమతులు అందించటానికి , మేము ‘గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్ 2024’ను పరిచయం చేసాము. ఈ పరిమిత కాల ప్రమోషన్ ద్వారా కస్టమర్లు ప్రతిరోజూ బంగారు నాణెం గెలుచుకునే అవకాశం లభిస్తుంది, అదే సమయంలో ఈ సీజన్‌లో ఫ్రీడమ్ హెల్తీ వంట నూనెల యొక్క ఆరోగ్య ప్రయోజనాలను సైతం ఆస్వాదిస్తారు. ఈ పథకంలో పాల్గొని దీనిని విజయవంతం చేసిన అదృష్టవంతులైన విజేతలను నేను అభినందిస్తున్నాను మరియు ఈ పథకంలో పాల్గొని దీనిని విజయవంతం చేసిన కస్టమర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..” అని అన్నారు.

ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ విటమిన్లు A & D తో బలవర్థకమైనది. ఇది సహజంగా లభించే విటమిన్ E తో కూడా సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల ఇది మొత్తం కుటుంబానికి ఆరోగ్యకరమైన ఎంపిక. సన్‌ఫ్లవర్ ఆయిల్ యొక్క ప్రముఖ బ్రాండ్, ఫ్రీడమ్ మరియు ప్రస్తుతం భారతదేశంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ విభాగంలో మార్కెట్ వాటా పరంగా నంబర్ 1 స్థానంలో ఉంది. (మూలం: నీల్సన్ MAT FEB, 2024).

Related Posts
మహారాష్ట్రలో పెరుగుతున్న GBS కేసులు
gbs cases

మహారాష్ట్రలో గిలియన్-బార్ సిండ్రోమ్ (GBS) కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 183కు చేరుకుంది. ఈ వ్యాధి Read more

పాకిస్థాన్ కు మరో ఎదురుదెబ్బ
final match of champions tr

29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ మెగాటోర్నీకి అతిథ్యమిచ్చిన పాకిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌ను లాహోర్‌లో నిర్వహించాలనుకున్నప్పటికీ, తాజా పరిణామాలతో ఆ Read more

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల
JEE Main Results Released

సత్తాచాటిన తెలుగు విద్యార్థులు.. న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తోన్న జేఈఈ (మెయిన్) ఫలితాలు ఫిబ్రవరి 11న విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలో Read more

ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ సీఎం అతిషి
Delhi CM Atishi exercised the right to vote

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అతిషి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా బరిలో సీఎం అతిషి ఓటు వేశారు. ఓటు వేసే ముందు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *