ప్రతి రామాలయానికి ఉచితంగా ‘ఆదిపురుష్’ 101 టికెట్లు

ఆదిపురుష్ ఫ్యాన్స్ మరో గుడ్ న్యూస్. ‘ఆదిపురుష్‌’ ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఒక సీటుని ఆంజనేయుడి కోసం ఖాళీగా ఉంచాలని చిత్రబృందం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో, ప్రతి రామాలయానికి ఉచితంగా 101 టికెట్లు ఇవ్వదలచుకున్నామని ప్రముఖ ఈవెంట్స్‌ ఆర్గనైజింగ్‌ సంస్థ శ్రేయస్‌ మీడియా తెలిపింది.

ప్రభాస్ – కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ లంకాధిపతి రావణాసురుడుగా కనిపిస్తుండగా రాముడి గా ప్రభాస్ , సీతగా కృతి కనిపించనున్నారు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. జూన్ 16 న పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఈ క్రమంలో ఈ మంచి కార్యాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రముఖ ఈవెంట్స్‌ ఆర్గనైజింగ్‌ సంస్థ శ్రేయస్‌ మీడియా ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో, ప్రతి రామాలయానికి ఉచితంగా 101 టికెట్లు ఇవ్వదలచుకున్నామని ఆదివారం ప్రకటించింది. తన సొంత డబ్బులతోనే ఈ టికెట్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్టు శ్రేయస్‌ మీడియా అధినేత శ్రీనివాస్‌ మీడియాతో పేర్కొన్నారు.