Former Vice President Hamid Ansari who exercised the right to vote at home

ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొబైల్‌ పోస్టల్‌ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకుని ఆయన ఓటు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇంటి నుంచి ఓటు వేయాలనుకున్న అర్హులైన వృద్ధులు, వికలాంగులు దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల సిబ్బందే సదరు ఓటరు ఇంటికి వెళ్లి ఓటు వేయించుకుంటారు.

పోలింగ్‌కు ముందే ఈ ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ ప్రక్రియు పూర్తిచేస్తారు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ జిల్లాలోని ఎన్నికల కార్యాలయం కూడా జిల్లాలో ఇంటి నుంచి ఓటు వేసే సౌకర్యం కల్పించింది. ఈ సౌకర్యాన్ని మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ఉపయోగించుకున్నారు. మొబైల్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఆయన సోమవారం ఉదయం ఓటు వేశారు. అన్సారీ ఓటు హక్కు వినియోగించుకున్న ఫొటోలను న్యూఢిల్లీ జిల్లా ఎన్నికల కార్యాలయం విడుదల చేసింది.

ఇక, వచ్చే నెల (ఫిబ్రవరి) 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార ఆప్‌, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ హవా కొనసాగింది. ఆ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. బీజేపీకి 2015లో మూడు, 2020లో 8 ఎమ్మెల్యే స్థానాలు దక్కాయి.

Related Posts
త్వరలో భారతీయ సర్వర్లలో డీప్‌సీక్ AI: ఐటీ మంత్రి
త్వరలో భారతీయ సర్వర్లలో డీప్‌సీక్ AI: ఐటీ మంత్రి

భారతీయ సర్వర్లలో త్వరలో చైనీస్ AI ప్లాట్‌ఫారమ్ డీప్‌సీక్ హోస్టింగ్ ప్రారంభం అవుతుందని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు. డీప్‌సీక్ ఓపెన్ సోర్స్ మోడల్ Read more

ఆర్జీ కర్ కేసు: కోర్టు తీర్పు
ఆర్జీ కర్ కేసు: కోర్టు తీర్పు

కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసులో పోలీసు వాలంటీర్ సంజయ్ రాయ్‌ను శనివారం దోషిగా నిర్ధారించారు. Read more

ఇండియా టుడే సర్వేలో సీఎం చంద్రబాబుకు 4వ స్థానం
TTD and railway services on WhatsApp.. CM Chandrababu

రాష్ట్ర ప్రజలకు గర్వకారణం జాతీయ స్థాయిలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా Read more

హైదరాబాద్ లో గ్రాండ్ గా యమహా కామిక్ కాన్ లాంచ్
Yamaha Grand Debut at Comic

ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ 15 నవంబర్ 2024 నుండి 17 నవంబర్ 2024 వరకు హైదరాబాద్‌లో జరిగే కామిక్ కాన్ ఇండియా అనే దేశంలోని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *