former us president bill clinton hospitalised

బిల్‌ క్లింటన్ కు అస్వస్థత

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వాషింగ్టన్‌లోని మెడ్‌స్టార్‌ జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు క్లింటన్‌ వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. 78ఏండ్ల క్లింటన్‌ తీవ్ర జ్వరంతో బాధతుండటంతో హాస్పిటల్‌లో చేర్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. క్రిస్మస్ నాటికి తిరిగి ఇంటికి చేరుకుంటానని బిల్‌ క్లింటన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisements

కాగా, బిల్‌క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా రెండు సార్లు సేవలందించారు. 1993-2001 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత నుంచి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2004లో తీవ్ర ఛాతీ నొప్పి, శ్వాసకోస సమస్యలు రావడం వల్ల ఆయనకు నాలుగుసార్లు బైపాస్‌ సర్జరీ అయింది. 2005లో ఊపిరితిత్తులు దెబ్బతినడంతో దవాఖానలో చేరారు. 2021లో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌కు ఆరు రోజుల పాటు కాలిఫోర్నియాలోని హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. 2022లో కరోనా బారినపడిన ఆయన కొన్నిరోజులకు కోలుకున్నారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ల తరఫున ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు.

Related Posts
Murder: లేడీ డాన్ పాత్రా.. ఎవరు ఈమె
Murder: లేడీ డాన్ పాత్రా.. ఎవరు ఈమె

ఢిల్లీలో బాలుడి హత్య కలకలం: లేడీ డాన్ జిక్రా అరెస్ట్ ఇటీవల ఢిల్లీ నగరాన్ని కుదిపేసిన ఘోరమైన ఘటనగా ఓ బాలుడి హత్య కేసు తెరపైకి వచ్చింది. Read more

తెలంగాణ సంక్షోభానికి కాంగ్రెస్సే కారణం: కేటీఆర్
BRS will always stand by workers.. KTR

తెలంగాణ సంక్షోభానికి, రైతు ఆత్మహత్యలకు కాంగ్రెస్సే కారణం కె.టి.రామారావు ఆరోపణ. తెలంగాణలో ఆత్మహత్యల పెరుగుదలకు, పరిస్థితి దిగజారడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KT Read more

సిద్ధం అవుతున్న సంక్రాంతి పుంజులు
సిద్ధం అవుతున్న సంక్రాంతి పుంజులు

సంక్రాంతి పండుగ అంటే కోడి పందేల సందడి. ముఖ్యంగా గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడి పందేలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ పందేల కోసం రాష్ట్రంలోని వివిధ Read more

అత్యుత్తమ వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీ
HYD biryani

హైదరాబాద్ బిర్యానీ మరోసారి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి సాధించింది. ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్టీ అట్లాస్ ఇటీవల ప్రకటించిన ప్రపంచ అత్యుత్తమ వంటకాల జాబితాలో హైదరాబాద్ బిర్యానీ Read more

×