జైలు నుంచి మాజీ సీఎం హేమంత్ సోరెన్ విడుదల

భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ శుక్రవారం రాంచీలోని బిర్సా ముండా జైలు నుంచి విడుదల అయ్యారు. జార్ఖండ్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో అయిదు నెలల జైలు జీవితం అనంతరం ఆయన బయటకువచ్చారు. భార్య కల్పనా సోరెన్ వెంటరాగా హేమంత్ సోరెన్‌ జైలు నుంచి బయటకు వస్తూ జేఎంఎం కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు.

అనంతరం ఆయన సతీమణి కల్పనా మాట్లాడుతూ.. భూ కుంభకోణంలో కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఆమె స్వాగతించారు. తన భర్త ఎలాంటి తప్పు చేయకున్నా కేంద్రంలోని బీజేపీ తమపై కక్షగట్టి జైలుకు వెళ్లేలా చేసిందని మండిపడ్డారు. మళ్లీ నెలల తర్వాత సంతోషకరమైన రోజు రానేవచ్చిందని కల్పన సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగ హేమంత్ సోరెన్ జైలులో ఉన్నన్నాళ్లు తమకు సపోర్టుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆమే పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.