ఫుడ్ పాయిజన్.. 60 మంది విద్యార్థినులకు అస్వస్థత

ఇటీవల ఏపీలో వరుసగా గిరిజన సంక్షేమ హాస్టల్స్ లలో , కాలేజీ హాస్టల్స్ లలో ఫుడ్ పాయిజన్ అనేది ఎక్కువ అవుతుంది. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన స్కూల్, కాలేజీ యాజమాన్యాల తీరు మాత్రం మారడం లేదు. దీంతో వందలాది విద్యార్థులు హాస్పటల్ పాలవుతున్నారు. మొన్నటికి మొన్న నూజివీడు IIIT కాలేజీ లో ఫుడ్ పాయిజన్ కారణంగా వందలాది మంది విద్యార్థులు హాస్పటల్ లో చేరగా..ఇంకా వారి ఆరోగ్యం కుదట పడలేదు.

ఈ ఘటన గురించి ఇంకా ప్రజలు మాట్లాడుకుంటుండగానే తాజాగా అల్లూరి(D) దుంబ్రిగూడలోని బాలికల గిరిజన సంక్షేమ పాఠశాలలో కలుషితాహారం తిని 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని అరకులోయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాలికల ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.