నిండుకుండ‌ల జూరాల జ‌లాశ‌యం..45 గేట్లు ఎత్తివేత‌

flood-water-inflow-to-jurala-project-and-45-gates-lift

జోగులాంబ గ‌ద్వాల : రాష్ట్రంలో మ‌ళ్లీ వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు నిండుకుండ‌ను త‌ల‌పిస్తున్నాయి. జూరాల జ‌లాశ‌యానికి కూడా వ‌ర‌ద కొన‌సాగుతోంది. ప్రాజెక్టు 45 గేట్ల ద్వారా 3.26 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.20 ల‌క్ష‌ల క్యూసెక్కులుగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు వరద పోటెత్తింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2400 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో తిమ్మజిపేటలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, నాగర్‌కర్నూల్‌లో 8 సెం.మీ., అచ్చంపేటలో 7 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదయింది.