వరద పరిహారం.. 15 వేల మంది ఖాతాల్లో డబ్బులు జమ

భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందిస్తోంది. భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్ని కుదిపేశాయి. అనేక ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. ఇటు తెలంగాణలో పలు ప్రాంతాల్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. దీంతో వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. నష్టపరిహారంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదల్లో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి రూ.16,500 ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

అలాగే రైతులకు కూడా అండగా ఉంటామని చెప్పింది. తడిచిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని రైతులకు రేవంత్‌ సర్కార్‌ హామీ ఇచ్చింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. అయితే వరద బాధితుల ఖాతాల్లోకి నిన్నటి నుంచి డబ్బులు జమ చేస్తున్నారు. జిల్లాలోని బాధితుల ఖాతాల్లోకి నిన్నటి నుంచి డబ్బులు జమ చేస్తోంది. ఇల్లు డ్యామేజ్ అయితే 5.16,500, . 18,000 ఇస్తోంది. నిన్న 15వేల మంది ఖాతాల్లోకి రూ.25కోట్లు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగతా వారికి ఇవాళ జమ అవుతాయని చెబుతున్నారు.