fire started again in Los Angeles

లాస్ ఏంజెలెస్‌లో మళ్లీ మొదలైన కార్చిచ్చు..

న్యూయార్క్‌: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ఇటీవల చెలరేగిన కార్చిచ్చు మళ్లీ మొదలైంది. తాజాగా మరో ప్రాంతంలో కొత్త మంటలు చెలరేగాయి. దీంతో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు నెలకున్నాయి. కాస్టాయిక్ లేక్ సమీపంలోని కొండల ప్రాంతం నుంచి అగ్నికీలలు విస్తరిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇవి కేవలం కొన్నిగంటల వ్యవధిలోనే 8వేలకు పైగా ఎకరాలకు వ్యాపించినట్లు తెలిపారు. దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే నివాసాలను ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు.

కాస్టాయిక్ లేక్ సమీపంలో బుధవారం ఉదయం పెద్దెత్తున మంటలు చెలరేగాయి. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ అగ్నికీలలు 39 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న చెట్లను, పొదలను బూడిద చేశాయి. తాజాగా కార్చిచ్చు మొదలైన ప్రాంతం..ఇటీవల అగ్నికి అహుతైన ఈటన్, పాలిసేడ్స్ కు కేవలం 64కిలోమీరట్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాల్లో మంటలు ఇంకా ఆరలేదు. దీనికి తోడు దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తున్న బలమైన గాలులు మరింత ప్రమాదకరంగా మారాయి. బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరో చోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి.

image

తాజాగా కార్చిచ్చు మొదలైన ప్రాంతం ఇటీవలి దావానలంలో కాలి బూడిదైన ఈటన్, పాలిసేడ్స్‌కు 64 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తున్న బలమైన గాలులు ఈ కార్చిచ్చుకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దీంతో విమానాలతో వాటర్ బాంబులను జారవిడుస్తున్నారు. కాగా, ఇటీవల లాస్‌ ఏంజెలెస్‌లోనే చెలరేగిన కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. హాలీవుడ్ సహా పలు ప్రాంతాల్లో వేలాది నిర్మాణాలను బూడిద చేసింది. 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు పాలిసేడ్స్‌లో 68 శాతం, ఈటన‌లో 91 శాతం మంటలను అదుపు చేశారు.

Related Posts
విజయ్ కి భారీ ఆఫర్ ఇచ్చిన ఇండియా కూటమి
India alliance that gave a huge offer to Vijay

సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం చీఫ్ విజయ్‌కు ఇండియా కూటమి నుంచి కీలక ఆహ్వానం అందింది. దేశంలో విభజన శక్తులపై పోరాడేందుకు తమ కూటమిలో చేరాలని Read more

ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వడం అవసరం: బైడెన్
bidn scaled

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు, అమెరికా ప్రజలకు "శాంతియుత అధికార మార్పిడి" గురించి భరోసా ఇచ్చారు. ఆయన గతంలో డోనాల్డ్ Read more

కోహ్లీని జోకర్‌గా చూపిన మీడియాపై రవిశాస్త్రి కౌంటర్
కోహ్లీని జోకర్‌గా చూపిన మీడియాపై రవిశాస్త్రి కౌంటర్

ఆస్ట్రేలియా వార్తాపత్రికలో విరాట్ కోహ్లీని విదూషకుడిగా చిత్రీకరించడంపై రవిశాస్త్రి స్పందించారు భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి, ఆస్ట్రేలియా మీడియా విరాట్ కోహ్లీపై చూపించిన వైఖరిని Read more

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం… ప్రైవేటు వర్సిటీల చట్టసవరణ ఆమోదం
ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం... ప్రైవేటు వర్సిటీల చట్టసవరణ ఆమోదం

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం ప్రైవేటు వర్సిటీల చట్టసవరణ ఆమోదం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ రోజు సచివాలయంలో జరిగింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *