ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో మెట్రో స్టేషన్ కింద భారీగా మంటలు చెలరేగాయి.దీంతో పక్కనే శ్రీ దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు. రెండు ఫైర్ ఇంజిన్లను సంఘటనా స్థలానికి పంపించి మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఆ దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ పక్కనే తపాడియా ఆస్పత్రి ఉండటంతో ఆస్పత్రి వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను అక్కడి నుంచి బయటికి తరలించారు. ఇక ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతం మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయింది. ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్‌ వైపు వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు.