Filmfare Awards 2024 : ఉత్తమ చిత్రం బలగం

69వ శోభ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ -2024 వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు హాజరై సందడి చేసారు. అలాగే పలువురు నటీమణులు తమ డాన్సులతో ఉత్సాహం నింపారు. సందీప్‌ కిషన్‌, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ యాంకర్లుగా ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో రాశీఖన్నా, అపర్ణ బాలమురళీ, సానియా ఇయాపాన్‌, గాయత్రీ భరద్వాజ్‌ తదితరుల డాన్సులు అలరించాయి.

ఇక అవార్డ్స్ విషయానికి వస్తే..చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘బలగం’ (Balagam) ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు, ఉత్తమ దర్శకుడిగా వేణు (Venu Yeldandi) అవార్డు అందుకున్నారు. ‘దసరా’లో (Dasaara) నటనకు గానూ నాని (Nani), కీర్తి సురేష్‌(Keerthy suresh)లు ఉత్తమ నటీనటులుగా ఎంపికయ్యారు. ఉత్తమ పరిచయ దర్శకుడి అవార్డును ఇద్దరు అందుకున్నారు. శ్రీకాంత్‌ ఓదెల (దసరా), శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న) ఇద్దరి సినిమాల్లోనూ నాని కథానాయకుడిగా నటించడం మరో విశేషం. ‘బేబీ’ చిత్రానికి కూడా వివిధ విభాగాల్లో అవార్డులు లభించాయి.

69 శోభ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2024 తెలుగు విజేతల లిస్ట్ చూస్తే..

ఉత్తమ చిత్రం: బలగం
ఉత్తమ నటుడు: నాని (దసరా)
ఉత్తమ నటి: కీర్తి సురేష్‌ (దసరా)
ఉత్తమ దర్శకుడు: వేణు యెల్దండి (బలగం)
ఉత్తమ పరిచయ దర్శకుడు: శ్రీకాంత్‌ ఓదెల (దసరా), శౌర్యువ్‌ (హాయ్‌నాన్న)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): సాయి రాజేష్‌ (బేబీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌): వైష్ణవి చైతన్య (బేబీ)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): నవీన్‌ పొలిశెట్టి (మిస్‌ శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టి), ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ)
ఉత్తమ సహాయ నటుడు: రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)
ఉత్తమ సహాయ నటి: రూప లక్ష్మీ (బలగం)
ఉత్తమ గాయకుడు: శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
ఉత్తమ గాయని: శ్వేత మోహన్‌ (మాస్టారు.. మాస్టారు.. సార్‌)
ఉత్తమ గేయ సాహిత్యం: అనంత్‌ శ్రీరామ్‌ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
ఉత్తమ సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌ (బేబీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూరన్‌ (దసరా)
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: కొల్లా అవినాష్‌ (దసరా)
ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్‌ రక్షిత్‌ (ధూమ్‌ ధామ్‌ దోస్తానా.. దసరా)
69వ శోభ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2024 తమిళ చిత్రాల విజేతలు వీళ్లే

ఉత్తమ చిత్రం: చిత్త (తెలుగులో చిన్నా)
ఉత్తమ నటుడు: విక్రమ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌2)
ఉత్తమ నటి: నిమేషా సజయన్‌ (చిత్త)
ఉత్తమ దర్శకుడు: ఎస్‌యూ అరుణ్‌ కుమార్‌ (చిత్త)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): వెట్రిమారన్‌ (విడుదలై పార్ట్‌-1)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): సిద్ధార్థ్‌ (చిత్త)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌): ఐశ్వర్య రాజేశ్‌ (ఫర్హానా), అపర్ణ దాస్‌ (దాదా)
ఉత్తమ సహాయ నటుడు: ఫహద్‌ ఫాజిల్‌ (మామన్నన్‌)
ఉత్తమ సహాయ నటి: అంజలి నాయర్‌ (చిత్త)
ఉత్తమ గాయకుడు: హరిచరణ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌2)
ఉత్తమ గాయని: కార్తికా వైద్యనాథన్‌ (చిత్త)
ఉత్తమ గేయ సాహిత్యం: ఇలంగో కృష్ణన్‌ (అగ నగ.. పొన్నియిన్‌ సెల్వన్‌2)
ఉత్తమ సంగీతం: దిబు నినాన్‌ థామస్‌, సంతోష్‌ నారాయణన్‌ (చిత్త)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌2)
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: తోట తరణి (పొన్నియిస్‌ సెల్వన్‌2)