Female students fell ill af

తాండూరు గిరిజన వసతిగృహంలో భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థినిలు

వికారాబాద్ జిల్లా తాండూరులోని వసతి గృహంలో భోజనం వికటించి విద్యార్థినిలు అనుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని సాయిపూర్లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా హాస్టల్ భోజనంలో నాణ్యత లోపించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నంలో పురుగులతో పాటు అడ్డదిడ్డంగా వంటకాలు చేస్తున్నారని, పరిశుభ్రత పాటించడం లేదని విద్యార్థినులు ఆరోపించాడు. నీళ్ళ వారు తప్ప ఇతర కూరగాయల రుచి ఎరుగమని, కిచెన్లో సైతం అపరిశుభ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

సోమవారం రాత్రి వండిన భోజనం తినలేకపోయామని వాపోయారు. భోజనం తిన్న విద్యార్థులు వాంతులు చేసుకొని అస్వస్థతకు గురయ్యావని, హాస్టల్ టీచర్ మంగళవారం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అస్వస్థతకు గురైన వారిని తరలించినట్లు విద్యార్థినులు తెలిపాడు. దాదాపు 15 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని పేర్కొన్నారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు ఫుడ్ పాయిజన్ పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పంధించి తగు చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Related Posts
ఏపీలో అతి తీవ్ర భారీ వర్షాలు పడే ఛాన్స్
imd warns heavy rains in ap and tamil nadu next four days

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఫెంగల్' తుఫాన్ గడిచిన 6గంటల్లో 10 కిమీ వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. పుదుచ్చేరికి 100 కి.మీ, చెన్నైకి 100 కి.మీ. దూరంలో Read more

కరెంటు ఛార్జీలపై ఏపీ ప్రభుత్వం శుభవార్త
current bill hike

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి కరెంటు ఛార్జీల పెంపును పూర్తిగా తగ్గించి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ఠాగూర్ రామ్ Read more

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు..
pawan paul

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసాడు. పవన్ పై 14 Read more

South Railway : మూడు రోజుల్లోనే టికెట్ డబ్బు వాపస్ – రైల్వేశాఖ
తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్!

సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు ఓ శుభవార్తను ప్రకటించింది. వివిధ కారణాల వల్ల రద్దయిన రైళ్ల టికెట్ డబ్బును ప్రయాణికులకు కేవలం మూడు రోజులలోపే తిరిగి చెల్లించనున్నట్లు Read more