Female ASI attempted suicid

పోలీస్ స్టేషన్లో మహిళా ఏఎస్సై ఆత్మహత్యాయత్నం..

మహిళలకు ఎక్కడ రక్షణ అనేది దక్కడం లేదు. మహిళలను కాపాడే పోలీసులే కీచకులుగా మారుతున్నారు. తోటి మహిళా పోలీస్ అధికారిపై కూడా వేదింపులు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న మహిళా ఏఎస్సైనే ఓ SI వేధించడం తో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లా చిలిప్ చేడ్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది.

పోలీస్ స్టేషన్ లో ఎస్సై యాదగిరి తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళా ఏఎస్సై పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె సోదరుడు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగుచూసింది. తమ స్టేషన్ ఎస్సై యాదగిరి తనకు రెండురోజులు కంటిన్యూగా డ్యూటీ వేసి.. ఒకరోజు రెస్ట్ తీసుకుంటే ఆబ్సెంట్ వేస్తున్నాడని, ఆయనకు లొంగకపోతే ఇలా మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు లేఖలో పేర్కొంది. అందరినీ ఒకలా, తనను మరోలా చూస్తున్నాడని.. ప్రతి చిన్నదానికి ఆబ్సెంట్ వేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. తనకు ఎలాంటి అఘాయిత్యం జరిగినా.. అందుకు కారణం ఎస్సై యాదగిరినే అని, మహిళా పోలీసులను లొంగదీసుకోవాలని వేధించే అతడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని, కఠినంగా శిక్షించాలని కోరింది.

Related Posts
మోడీని పలు అభివృద్ధి పనుల అనుమతిని కోరిన రేవంత్ రెడ్డి
narendra modi and revanth reddy

సోమవారం చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనుల చిట్టాను విప్పినట్లు తెలుస్తున్నది. ఈ సందర్బంగా Read more

గరికపాటి నరసింహారావు పై తప్పుడు ప్రచారం
గరికపాటి నరసింహారావు పై తప్పుడు ప్రచారం

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త గరికపాటి నరసింహారావు బృందం కొంతమంది యూట్యూబ్ ఛానళ్లు మరియు వ్యక్తులు గరికపాటిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఒక అధికారిక ప్రకటనలో, గరికపాటి Read more

నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం
Sabarimala temple to be opened today

తిరువనంతపురం: నేటి నుంచి శబరిమల ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. కొద్దిరోజుల క్రితం ఆలయాన్ని మూసివేసిన పూజారులు నేడు తెరవనున్నారు. మకర విళక్కు పూజల కోసం సాయంత్రం ఐదు Read more

తెలంగాణ బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదు
తెలంగాణ బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్ళకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి మరణిస్తుందటంతో తెలంగాణ అధికారులు అలెర్ట్ అయ్యారు. తెలంగాణా ప్రజలు చికెన్ తక్కువగా తినాలని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *