February 7 Assembly special meeting.

ఫిబ్రవరి 7 అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..!

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణన పై ఫోకస్ చేసింది. ఇప్పటికే కులగణన పూర్తి అయిన నేపథ్యంలో ఫిబ్రవరి 2న కులగణన సర్వే రిపోర్ట్‌ ను అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనున్నారు. బీసీ రిజ్వేషన్ల పెంచాలని కోరుతూ కేంద్రానికి అప్పీలు చేయాలని శాసనసభలో నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు.. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సర్వే ఇప్పటికే పూర్తిగా అధికారులు ఫైనల్ రిపోర్టును రెడీ చేశారు. దానిపై ఫిబ్రవరి 5న మంత్రివర్గం భేటీ కానుంది.

Advertisements
image

తర్వాత అసెంబ్లీ సాక్షిగా కలగణనకు అమోదముద్ర తెలిపేందుకు ఫిబ్రవరి 7 నుంచి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. కులగణన నివేదికపై సభలో చర్చించి ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అలాగే ఈ కేబినెట్ భేటీలోనే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపైన కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసి.. అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ప్లాన్‌లో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు సమావేశంపై సీఎం ఇప్పటికి గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ప్రత్యేక సెషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది.

Related Posts
2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందే : అమిత్‌ షా ప్రకటన
Amit Shah is going to visit AP

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందేనని Read more

నేష‌న‌ల్ బ‌యోడైవ‌ర్స‌టీ కాన్ఫ‌రెన్స్ లో ప్ర‌స‌గించిన మంత్రి కొండా సురేఖ
నేష‌న‌ల్ బ‌యోడైవ‌ర్స‌టీ కాన్ఫ‌రెన్స్

నేష‌న‌ల్ బ‌యోడైవ‌ర్స‌టీ కాన్ఫ‌రెన్స్ - 2025 🔹 మూడు రోజుల పాటు జరగనున్న జీవవైవిధ్య సదస్సునేష‌న‌ల్ బ‌యోడైవ‌ర్స‌టీ కాన్ఫ‌రెన్స్ - 2025 ఫిబ్రవరి 20, 21, 22 Read more

ఫిబ్రవరిలో ఫ్రాన్స్ టూరు కు ప్రధాని మోదీ
PM Modi to visit France in February

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళనున్నారని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రకటించారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌లో జరిగే Read more

Peddapalli: చిన్నారిని హతమార్చి ఆపై ఆత్మహత్యకు పాల్పడిన మహిళ
చిన్నారిని హతమార్చి ఆపై ఆత్మహత్యకు పాల్పడిన మహిళ

పెద్దపల్లి జిల్లాలో అతి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన మూడేళ్ల చిన్నారిని ఉరివేసి అనంతరం తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ Read more

×