పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య..ఎందుకంటే

తమ పొలాన్ని ఆక్రమించుకున్నారని..దీనిపై దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వ అధికారాలను వేడుకున్న పట్టించుకోలేదనే ఆవేదనతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే..

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు భోజడ్ల ప్రభాకర్‌కు కొంత వ్యవసాయ భూమి ఉంది. అయితే, ఆ పొలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారంటూ ప్రభాకర్ ఇటీవల ఎమ్మార్వో, ఎస్సైకి ఇతర అధికారులకు ఫిర్యాదు చేశాడు. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తో రైతు ప్రభాకర్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన పొలాన్ని కాపాడుకునే మార్గం లేదంటూ కన్నీరు మున్నీరు అవుతూ… తనకు ఇక ఆత్మహత్యే శరణ్యమని డిసైడ్ అయిన రైతు ప్రభాకర్ పురుగుల మందు తాగుతూ.. ఓ సెల్ఫీ వీడియో చేశాడు.

అందులో.. ‘రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆ వీడియో తన గోడును వెల్లబోసుకుంటూ రైతు ప్రభాకర్ ప్రాణాలు విడిచాడు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.

తెలంగాణ గ్రామాల్లో మితిమీరుతున్న కాంగ్రెస్ నాయకుల అరాచకాలు..

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో రైతు బోజడ్ల ప్రభాకర్ ల్యాండ్ కబ్జా చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అనుచరులు

మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన రైతు

సీఎం రేవంత్ రెడ్డి,… pic.twitter.com/KRh3VT0sGz— BRS Party (@BRSparty) July 2, 2024