తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎంతో ఆసరాగా మారిన రైతు భరోసా పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేయడానికి సిద్ధమైంది. రేపటి నుంచి ఈ పథకం అమలులోకి రానుండగా, కొత్తగా పాస్బుక్లు పొందిన రైతులకు శుభవార్త ప్రకటించింది. జనవరి 1వ తేదీ వరకు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల కోసం రైతుభరోసా సైట్‌లో ప్రత్యేక ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకంలో కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు తమ పాస్బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలను సంబంధిత ఏఈవోలకు అందించాల్సి ఉంటుంది. ఈ వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేసే అవకాశం కల్పించారు. ఇలా అప్డేట్ చేసిన రైతులు రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితాలో చేరతారు.

గతంలో రైతు భరోసా లబ్ధి పొందనివారు కూడా ఈసారి అప్లై చేసుకునే అవకాశం కల్పించడం రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపుతోంది. అర్హతలున్న ప్రతీ రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ కొత్త సదుపాయాలు రైతుల వద్ద ఉన్న పాత సమస్యలను పరిష్కరించడంలో దోహదం చేస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రైతు భరోసా పథకం ప్రారంభం నుంచి లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం అందుతుంది. పండ్ల సీజన్లకు ముందే ఈ సాయాన్ని అందించడం వల్ల రైతులు ఆర్థికంగా లబ్ధిపొందుతున్నారు. కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసిన రైతులను కూడా ఈ పథకంలో చేర్చడం పథకాన్ని మరింత సమర్థవంతంగా మార్చనుంది. రైతు భరోసా పథకం విస్తరణతో రాష్ట్రంలోని రైతులకు మరింత మేలు జరగనుంది. పథకం అమలుకు సంబంధించి ఏఈవోలు, సంబంధిత అధికారులు ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతులందరూ తమ వివరాలను త్వరగా అందజేసి ఈ సదుపాయం పొందాలని సూచించింది.