Command And Control Centre

కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి నకిలీ పోలీస్

  • మరో ఫేక్‌ ఆఫీసర్‌ బాగోతం వెలుగులోకి
  • మొన్న సెక్రటేరియట్ .. నేడు కమండ్ కంట్రోల్ లో భద్రతా వైఫల్యం

హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (CCC) లోకి నకిలీ కానిస్టేబుల్ ప్రవేశించడం పోలీసులను షాక్‌కు గురి చేసింది. జ్ఞాన సాయి ప్రసాద్ అనే వ్యక్తి తాను కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నానని నమ్మబలికాడు. అతను పోలీస్ అధికారిగా నటించి గోవర్ధన్ అనే వ్యక్తి నుంచి రూ.3 లక్షలు తీసుకున్నాడు. అసలు విషయం బయటపడకుండా ఉండేందుకు సీఎం సమీక్ష సమావేశం జరుగుతున్న సమయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోకి వెళ్లి వచ్చి తనను నిజమైన కానిస్టేబుల్‌గా నమ్మించేందుకు ప్రయత్నించాడు.

Police Command And Control

తర్వాత కొన్ని రోజుల పాటు జ్ఞాన సాయి ప్రసాద్ కనిపించకపోవడంతో మోసపోయిన గోవర్ధన్ అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. తనను మోసం చేసి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని CCTV ఫుటేజీని పరిశీలించారు. ఆ ఫుటేజ్‌లో నిందితుడి చిత్రాలు స్పష్టంగా నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం నిందితుడి కోసం గాలింపు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసు వ్యవస్థలోకే నకిలీ పోలీస్ ఇలా ప్రవేశించడం, అధికారికంగా అత్యంత రక్షణ కలిగిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోకి ఇలా చొరబడటం పోలీసు విభాగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

Related Posts
అప్పుల పాలైన అన్నదాతలపై కక్ష ఎందుకు?: కేటీఆర్‌
అప్పుల పాలైన అన్నదాతలపై కక్ష

హైదరాబాద్‌: ఆత్మగౌరవంతో బతికే అన్నదాతలపై ఈ వరుస దాష్టీకాలేంటని, మీరు చేసిన పాపాలకు బక్కచిక్కిన రైతులపై ఈ దుర్మార్గాలేంటని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. వ్యవసాయరంగంలో Read more

సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం
Sukhbir Singh Badal shot in

శిరోమణి అకాలీదళ్ చీఫ్, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై బుధవారం హత్యాయత్నం చోటుచేసుకుంది. ఈ ఘటన అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయం వెలుపల జరిగింది. Read more

“యమ్మీ అప్రూవ్డ్ బై మమ్మీ” ను ప్రారంభించిన కిండర్ క్రీమీ
Kinder Creamy launched "Yummy Approved by Mummy".

హైదరాబాద్‌ : పిల్లల స్నాక్స్ విషయంలో, అమ్మలకు ఎల్లప్పుడూ ఉత్తమంగా తెలుసు. నేటి అమ్మలు తమ పిల్లల ఉల్లాసకరమైన మనోస్థితిలో, తాము అందించే స్నాక్స్ పరిమాణం మరియు Read more

దేవుడి దగ్గర రాజకీయలు ఎందుకు?- శ్రీనివాస్ గౌడ్
Why politics with God?- Srinivas Goud

తిరుమల శ్రీవారి ఆలయంలో అందరిని సమానంగా చూడాలని తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. దేవాలయాల్లో ప్రాంతాల మధ్య తేడాలు లేకుండా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. Read more