ఫేక్ న్యూస్‌.. కోర్టు మెట్లెక్కిన అమితాబ్ ఫ్యామిలీ..

Fake news.. Amitabh family went to court..

అమితాబ్ మ‌న‌వ‌రాలిపై ఫేక్ న్యూస్‌ను యూట్యూబ్‌లో పోస్టు చేయడం తో అమితాబ్ ఫ్యామిలీ కోర్టును ఆశ్ర‌యించింది. దీంతో కోర్ట్ పలు యూట్యూబ్ చానెల్స్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది. యూట్యూబ్‌లో 11 ఏళ్ల ఆరాధ్య ఆరోగ్యం గురించి ఓ ఫేక్ న్యూస్ వైరల్ చేసారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం ఐశ్వ‌ర్య రాయ్ బ‌చ్చ‌న్‌, అభిషేక్ బ‌చ్చ‌న్‌లు కోర్టును ఆశ్ర‌యించారు.

కేసు విచార‌ణ స‌మ‌యంలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్ యూట్యూబ్‌ను హైకోర్టు నిల‌దీసింది. త‌ప్పుడు కాంటెంట్‌ను పోస్టు చేయ‌కుండా ఉండే పాల‌సీలు ఏమీ లేవా అని కోర్టు యూట్యూబ్‌ను ప్ర‌శ్నించింది. యూజ‌ర్ల‌కు ఓ ఫ్లాట్‌ఫామ్ ఇచ్చేశాం, వాళ్లు ఏది పోస్టు చేసినా త‌మ‌కు బాధ్య‌త లేద‌న్న‌ట్లు యూట్యూబ్ వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాదు అని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.

ఐశ్వ‌ర్య వేసిన పిటిష‌న్ ఆధారంగా గూగుల్, యూట్యూబ్‌కు స‌మ‌న్లు జారీ చేశారు. ఈ తరహా ట్రోలింగ్స్పై ఆరాధ్య తండ్రి అభిషేక్ బచ్చన్ చాలాసార్లు సీరియస్ అయ్యారు. 11ఏండ్ల తమ పాపను టార్గెట్ చేయడం సరికాదని చెప్పారు. ఎంతకీ సమస్య పరిష్కారం కాకపోవడంతో.. ఇటీవల ఆ కుటుంబం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.