Faith in Prime Minister Modi has been proved once again.. Pawan Kalyan

మరోసారి మోడీ పై విశ్వాసం రుజువైంది: పవన్‌ కల్యాణ్‌

అమరావతి: ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించడం ద్వారా ప్రధాని మోడీపై విశ్వాసం మరోసారి రుజువైందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీ విజయంపై స్పందిస్తూ.. 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలిచేలా మోడీ పాలన సాగిస్తున్నారు. ఈ లక్ష్యాన్ని అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకం. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఢిల్లీలో సమ్మిళిత అభివృద్ధి అని అన్నారు.

image

ప్రధాని మోడీ నిర్దేశించిన లక్ష్యం అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. అమిత్‌ షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలనిచ్చాయని తెలిపారు. ఈ విజయం దేశాభివృద్ధికి శుభసూచకమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఢిల్లీలో సమగ్ర అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువవుతాయన్నారు. ‘వికసిత సంకల్ప పత్రం’ ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నాయని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు, పరిపాలన సాగుతుందని ఢిల్లీ ప్రజలు నమ్మకంతో ఓటు వేశారని వ్యాఖ్యానించారు.

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయానికి ప్రధాన కారణమైన నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ నేతలు, మిత్రపక్ష నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విశేష విజయాన్ని సాధించింది. 70 స్థానాలున్న ఈ ఎన్నికల్లో బీజేపీ 47 స్థానాల్లో గెలుపొందగా, ఆమ్ ఆద్మీ పార్టీ 23 స్థానాలకే పరిమితం అయింది. మరోవైపు, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఎలాంటి విజయం సాధించలేదు.

Related Posts
విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేశ్‌
విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేశ్‌

అమరావతి: తన పరువుకు భంగం కలిగించేలా అసత్య కథనాలు ప్రచురించారంటూ సాక్షి దినపత్రికపై వేసిన పరువు నష్టం కేసులో మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖ కోర్టుకు Read more

హైకోర్టును ఆశ్రయించిన ఈటల రాజేందర్
etela rajender slaps

బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తనపై మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. Read more

తైవాన్ అధికారుల బృందంతో మంత్రి లోకేశ్ భేటీ
Minister Lokesh met with a group of Taiwanese officials

తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్‌తో మంత్రి చర్చలు అమరావతి: మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో తైపేయి ఎకనామిక్ అండ్ Read more

తెలంగాణ మహిళా కమిషన్‌కు సింగర్‌ కల్పన ఫిర్యాదు
Singer Kalpana files complaint with Telangana Women's Commission

హైదరాబాద్‌: సింగర్‌ కల్పన మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం అంటూ కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ నేరెళ్ల శారదకు Read more