F 35 fighter jet crashes at Alaska Air Force base after pilot ejects

కుప్ప‌కూలి.. పేలిన ఎఫ్‌-35 యుద్ధ విమానం..

న్యూయార్క్‌: అమెరికాకు చెందిన ఎఫ్‌-35 యుద్ధ విమానం(F-35 Crash) కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న అల‌స్కాలోని ఎలిస‌న్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో జ‌రిగింది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆకాశంలో విన్యాసం చేస్తున్న స‌మ‌యంలో.. ఒక్క‌సారిగా ఎఫ్‌-35 కింద‌కు జారింది. విమానాశ్ర‌య ర‌న్‌వేపై ప‌డి పేలిపోయింది. ఆ స‌మ‌యంలో భారీగా మంట‌లు వ్యాపించాయి. ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతున్న‌ది. ర‌న్‌వేపై కూల‌డంతో జెట్ పూర్తిగా ధ్వంస‌మైంది.

ఆ యుద్ధ విమానంలో ఉన్న పైలెట్ ప్ర‌స్తుతం క్షేమంగా ఉన్నాడు. అత‌న్ని బాసెట్ ఆర్మీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఎయిర్ బేస్ పరిధిలోనే ఈ ప్రమాదం జరగడంతో.. అధికారులు వెంటనే స్పందించగలిరారు. ప్ర‌మాదంపై ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఇక, విమానం కూలిపోవడానికి గల కారణం ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు సాంకేతిక నిపుణులు. ఈక్రమంలోనే ఎఫ్-35 యుద్ధ విమానంలోని శకలాలను పరిశీలిస్తున్నారు. కానీ విమానంలోని ఎక్కువ భాగాలు కాలిపోవడంతో.. ఎలాంటి ఆధారాలు లభించడం లేదు. పైలెట్ కోలుకుంటే తప్ప ఈ ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందో తెలిసేలా లేదు.

కాగా, అమెరికాలో F-35 విమానం గగనతలంలో కూలిపోవడం ఇదే మొదటిసారి కాదు. టెక్సాస్ నుండి లాస్ ఏంజిల్స్ సమీపంలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు వెళుతున్న F-35 ఫైటర్ జెట్.. మే 2024లో న్యూ మెక్సికోలో ఇంధనం నింపుకోవడానికి పైలట్ ఆపేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. కుప్ప‌కూలిపోయింది. తీవ్ర గాయాలపాలైన పైలట్‌ను ఆస్పత్రికి తరలించారు. మ‌రో యుద్ధ విమానం 2023 సెప్టెంబర్‌లో సౌత్ కరోలినాలో కూలిపోయింది.

Related Posts
Harsha Sai : యూట్యూబర్ హర్ష సాయిపై కేసు
harshasai

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి(Harsha Sai)పై బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఆరోపణలతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ Read more

బిహార్ మత్తు నిషేధంపై హైకోర్టు ఆగ్రహం..?
patna high court

బిహార్ రాష్ట్రంలో మత్తు నిషేధం అమలులో ఉన్న నేపథ్యంలో, పాట్నా హైకోర్టు బిహార్ ప్రభుత్వానికి తీవ్ర సమీక్ష చేసింది. కోర్టు, ఈ నిషేధం బిహార్ అధికారులకు పెద్ద Read more

Telangana : తెలంగాణ రాష్ట్ర అప్పు ఎంతంటే?
Telangana State Debt

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కీలక వివరాలను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ప్రకారం, తెలంగాణకు మొత్తం Read more

డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేసిన మాట్ గేట్జ్, అటార్నీ జనరల్ పదవి నుంచి ఉపసంహరించుకున్నారు..
matt gaetz

అమెరికాలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పరిపాలన కోసం పలు ప్రముఖ వ్యక్తులను వివిధ పదవుల కోసం ఎంపిక చేశారు. ఈ ఎంపికల్లో ఒకరు Read more