explosion at building kills two people in moscow

ఐఈడీ పేలుడు.. కెమిక‌ల్ డిఫెన్స్ చీఫ్ మృతి

మాస్కో: ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో ఈరోజు అనుమానిత ఐఈడీ పేలుడు సంభ‌వించింది. న‌గ‌రంలోని రాజ‌న్‌స్కీ ప్రాస్పెట్ ప్రాంతంలో ఉన్న ఓ బిల్డింగ్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ పేలుడు వ‌ల్ల ఇద్ద‌రు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈఘటనలో కెమిక‌ల్ డిఫెన్స్ చీఫ్ మృతి లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ ఇగోర్ కిరిల్లోవ్ మృతిచెందిన‌ట్లు ర‌ష్యా ప్ర‌భుత్వం ద్రువీక‌రించింది. అయితే ఆ ఘ‌ట‌న ఎందుకు జ‌రిగింద‌న్న దానిపై ర‌ష్యా ద‌ర్యాప్తు సంస్థ ఇంకా ఎటువంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. ప్ర‌స్తుతం పేలుడు జ‌రిగిన ప్ర‌దేశంలో ఫోరెన్సిక్ నిపుణులు స‌మాచారం సేక‌రిస్తున్నారు. మెడిక‌ల్‌, బాంబు ఎక్స్‌ప‌ర్ట్స్ కూడా ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్నారు. సైడ్‌వాక్ వ‌ద్ద ఇద్ద‌రు వ్య‌క్తుల మృత‌దేహాలు ఉన్న‌ట్లు అనేక వీడియోలు, ఫోటోల ఆధారంగా తెలిసింది.

మృత‌దేహాల వ‌ద్ద భారీగా ర‌క్తం క‌నిపించింది. అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో విండోలు, బ్రిక్‌వ‌ర్క్ ధ్వంస‌మైన ఫూటేజ్ కూడా రిలీజైంది. రేడియోలాజిక‌ల్ కెమిక‌ల్ అండ్ బ‌యోలాజిక‌ల్ డిఫెన్స్ ద‌ళాల చీఫ్ ఆ పేలుడు మృతిచెందిన‌ట్లు పేర్కొన్నారు. బిల్డింగ్ ఎంట్రెన్స్ వ‌ద్ద పార్క్ చేసిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌లో పెట్టిన ఐఈడీని రిమోట్‌తో పేల్చిన‌ట్లు తెలుస్తోంది. 54 ఏళ్ల కిరిల్లోవ్‌.. 2017 నుంచి ర‌ష్యా కెమిక‌ల్ డిఫెన్స్ చీఫ్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నారు. యుద్ధ‌క్షేత్రంలో ర‌సాయ‌నిక ఆయుధాలు వాడ‌డంలో కిరిల్లోవ్ నిష్ణాతుడు. ఉక్రెయిన్‌లో ఉన్న అనేక ల్యాబ్‌ల‌ను అమెరికా ఆప‌రేట్ చేస్తున్న‌ట్లు ఆయ‌న గ‌తంలో ఆరోపించారు.

Related Posts
కాశ్మీర్‌లో ఆర్మీ వాహనం ప్రమాదం: ఐదుగురు సైనికులు మరణం
Army Vehicle Accident

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని బాల్నోయ్ ప్రాంతంలో మంగళవారం జరిగిన విషాద ఘటనలో, ఒక ఆర్మీ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఐదుగురు సైనికులు ప్రాణాలు Read more

10 న ట్రంప్ కు శిక్ష ఖరారు!
10 న ట్రంప్ కు శిక్ష ఖరారు!

ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, హష్ మనీ కేసులో ట్రంప్ ను న్యూయార్క్ Read more

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కన్నుమూత
aga khan died

బిలియనీర్,పద్మవిభూషణ్ గ్రహీత,ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ (88)ఈ విషయాన్నీ ఆగాఖాన్ ఫౌండేషన్ ప్రకటించింది. 'ఆగాఖాన్ కుటుంబానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ కమ్యూనిటీకి సంతాపం తెలియజేస్తున్నాం.ప్రపంచంలోని Read more

నస్రల్లా అంత్యక్రియలు.. భారీగా తరలివచ్చిన ప్రజలు
నస్రల్లా అంత్యక్రియలు.. భారీగా తరలివచ్చిన ప్రజలు

గత ఏడాది సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా మరియు హషీమ్ సఫీద్దీన్ మరణించటం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆయన మరణించిన ఐదు Read more