వంగలపూడి అనితపై మాజీ హోంమంత్రి వనిత ఆగ్రహం

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ హోంమంత్రి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ ఫై అనిత చేసిన వ్యాఖ్యలపై వనిత మండిపడింది. అనిత చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని , తమ నాయకుడు జగన్ ఫై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతుంటే హోం మంత్రి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. అనిత కూడా ఎమ్మేల్యేగా గెలిచే మంత్రి అయ్యారని … చంద్రబాబు కూడా కుప్పానికి ఎమ్మేల్యేనే అని అన్నారు. పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని, వాళ్ల పనిని వాళ్లు చేసుకోనివ్వాలని పేర్కొన్నారు.