ktr revanth

సీఎం చెప్పినవన్నీ డొల్లమాటలే – కేటీఆర్

వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్య మంత్రివన్నీ డొల్లమాటలేనని సీఎం రేవంత్ ఫై కేటీఆర్ విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ పూర్తయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటని ప్రశ్నించారు. రాబందుల ప్రభుత్వం ఉండి రైతులకు ఏం లాభమని, రేవంత్ చేతకానితనం అన్నదాతలకు కోలుకోని శాపమని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

‘‘20 లక్షల మందికి రుణమాఫీ కానే కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైంది. వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయింది. ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా.. మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం. 2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటి ??

అధికారిక లెక్కల ప్రకారమే.. 20 లక్షల అన్నదాతలకు అన్యాయం జరిగితే అనధికారికంగా రుణమాఫీ కాని రైతులందరో ??. చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చేయలేదు. ఇవ్వాల్సిన రైతుబంధు సీజన్ ముగిసినా ఇయ్యలేదు. రాబందుల ప్రభుత్వం ఉండి రైతులకు ఏం లాభం. రేవంత్ చేతకానితనం.. అన్నదాతలకు కోలుకోని శాపం’’ అని కేటీఆర్‌ పోస్ట్‌ చేశారు.

Related Posts
దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
AP Govt is good news for disabled people

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..ప్రజలకు వరుస తీపి కబుర్లు తెలియజేస్తూ వారిలో ఆనందాన్ని , ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతుంది. ఓ పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలను Read more

గత ఏడాది అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీలు వీరే
celbs income

ఆదాయపు పన్ను భారీగా చెల్లించిన భారతీయ సెలబ్రిటీలకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఇందులో మన సౌత్ స్టార్ హీరో 2వ స్థానం దక్కడం ఇంటర్నెట్‌లో సంచలనం Read more

నడిరోడ్డు పై కాంగ్రెస్ నాయకుడు బర్త్ డే వేడుకలు..ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు
Congress leaders roadside

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో సోమవారం రాత్రి కాంగ్రెస్ నాయకుడు చిలుకూరి బాలూ పుట్టినరోజు వేడుకలు జరపడం తో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ వేడుకలు రాజీవ్ చౌక్ Read more

OG మూవీలో అకీరా నందన్..?
akira og

పవన్ కళ్యాణ్ - సుజిత్ కలయికలో 'OG' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో తెలియంది కాదు..కేవలం ఫస్ట్ లుక్ Read more