Government should support Telangana farmers.. Etela Rajender

ఐఏఎస్లు బానిసల్లా పనిచేయొద్దు – ఈటల

  • ప్రభుత్వాలు ఐదేళ్లపాటు మాత్రమే , ఐఏఎస్ అధికారులు 35 ఏళ్ల పాటు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల తీరుపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ, ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకుల బానిసల్లా వ్యవహరించొద్దని హెచ్చరించారు. ప్రభుత్వాలు ఐదేళ్లపాటు మాత్రమే ఉంటాయి, కానీ ఐఏఎస్ అధికారులు 35 ఏళ్ల పాటు పరిపాలనలో ఉంటారని, కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు.

Etela hydra

ఈటల తన ప్రసంగంలో, గతంలో ప్రభుత్వ పెద్దల అనుకూలంగా పని చేసిన కొన్ని అధికారులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. రాజకీయ నాయకుల మాటలకే లోబడిపోయి అధికార దుర్వినియోగానికి పాల్పడితే, వారి భవిష్యత్తుపై దుష్ప్రభావం పడుతుందని హెచ్చరించారు. అధికార యంత్రాంగం న్యాయబద్ధంగా పని చేయాలని, కేవలం అధికార పార్టీల ఆదేశాలకు లోబడకూడదని సూచించారు.

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారికి కఠిన చర్యలు తప్పవని ఈటల స్పష్టం చేశారు. తాము కాషాయ బుక్ మెంట్ైన్ చేస్తున్నామని, ఎవరైనా అధికార దుర్వినియోగానికి పాల్పడితే, భవిష్యత్తులో కచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజా సేవకులుగా వ్యవహరించాల్సిన అధికారులు, పాలక వర్గాలకు కొమ్ముకాస్తే జైలు పాలవ్వాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.

Related Posts
అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది: 15 సంవత్సరాల తర్వాత అగ్రస్థానం
students

2023-24 విద్యా సంవత్సరం కోసం విడుదలైన అధికారిక నివేదిక ప్రకారం, భారతదేశం 15 సంవత్సరాల తరువాత, అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల నమోదు లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ Read more

చంద్రబాబు అవగాహనారాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం – అంబటి
ambati polavaram

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవ్వడానికి చంద్రబాబు నాయుడి అవగాహనారాహిత్యమే కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనాన్ని వృథా చేస్తూ తీసుకున్న Read more

సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం
Sukhbir Singh Badal shot in

శిరోమణి అకాలీదళ్ చీఫ్, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై బుధవారం హత్యాయత్నం చోటుచేసుకుంది. ఈ ఘటన అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయం వెలుపల జరిగింది. Read more

పుష్కరిణిలో తెప్పపై శ్రీవారి విహారం తిరుమల
పుష్కరిణిలో తెప్పపై శ్రీవారి విహారం తిరుమల

పుష్కరిణిలో తెప్పపై శ్రీవారి విహారం తిరుమల తిరుమల, 2025 మార్చి 8: శ్రీవారి వార్షిక సాలకట్ల తెప్పోత్సవాలకు తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 9 నుంచి Read more