enforcement directorate investigation will start from today on this formula race

ఫార్ములా ఈ రేసుపై నేటి నుండి ఈడీ విచారణ

హైదరాబాద్‌: ఫార్ములా ఈ రేసుపై నేటి నుంచి ఈడీ విచారణ షురూ కానుంది. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ రేసు కేసుతో సంబంధం ఉన్న వారిని ఒక్కొక్కరిగా విచారణ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో HMDA మాజీ చీఫ్ BLN రెడ్డి మరికాసేపట్లో ఈడీ ముందుకు రానున్నారు. రేపు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్‌ ఈడీ ముందు హాజరుకానున్నారు.

ఈనెల 7న కేటీఆర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. దీనికి సబంధించి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు. పెమా చట్టాన్ని ఉల్లంఘించి HMDA నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేశారని ఈడీ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా.

ఈ కేసులో డిసెంబర్ 19న యాంటీ కరెప్షన్ బ్యూరో FIR నమోదు చేసింది. ఈ కేసులో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో అప్పుడు మున్సిపల్ కార్పోరేషన్ మంత్రిగా కేటీఆర్ సంతకం చేసినందకు విదేశీ సంస్థకు HMDA నిధులు మళ్లాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి లాభం చేకూర్చలేదనేది కేటీఆర్ వాదన. మరి ఈ కేసులో ఈడీ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి.

Related Posts
దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్‌
The center is good news for the people of the country

ఉద్యోగుల్లా ప్రతి నెల పింఛన్ వచ్చే పథకానికి రూపకల్పన న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్లకు వచ్చినట్టుగానే 60 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి Read more

పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం
jagan metting

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, Read more

APలో రూ.14వేల కోట్ల పెట్టుబడులు – TG భరత్
Orvakallu Industrial Park

కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో రూ.14వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ విషయాన్ని వెల్లడించారు. జపాన్‌కు చెందిన యిటోయే Read more

కొత్త పార్టీ పెట్టబోతున్న నహీద్ ఇస్లాం
Nahid Islam new party

బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక ప్రభుత్వ సలహాదారుగా ఉన్న నహీద్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను చీఫ్ Read more