jammu and kashmir

కుప్వారాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కుప్వారాలోని గుగల్‌ధర్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నంపై నిఘా సమాచారం అందిన వెంటనే, భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. కొన్ని గంటలపాటు కొనసాగిన ఎన్‌కౌంటర్ తర్వాత, కుప్వారాలోని గుగల్ధర్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ సిబ్బంది హతమార్చారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉ‍గ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయని భారత సైన్యం తెలిపింది.

గుగల్‌ధార్‌లో భారత సైనికులు అనుమానాస్పద కార్యకలాపాలను గమనించారని ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో తెలిపింది. చొరబాటుదారులను తిప్పికొడుతూ, భారత సైన్యం కాల్పులు ప్రారంభించింది. గుగల్ధార్ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని సైన్యం తెలిపింది.

ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. హతమైన ఉగ్రవాదికి జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తాజాగా రాజౌరీ జిల్లాలోని థానమండి ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల ఉనికి గురించి ఇంటెలిజెన్స్ నుంచి అందిన ఇన్‌పుట్ ఆధారంగా, థానమండిలోని మణియల్ గలి వద్ద భద్రతా బలగాలు సంయుక్త సెర్చ్‌ ఆపరేషన్ ప్రారంభించాయని అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

Related Posts
హైదరాబాద్ లో రెండు చోట్ల హాష్ ఆయిల్ సీజ్
Hash oil

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడలో 300 ఎం.ఎల్. హాష్ ఆయిల్‌ను టీఎస్ఎన్ఏబీ అధికారులు సీజ్ చేశారు. బండ్లగూడలో ఓ కిలేడి లేడీ రహస్యంగా హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు Read more

ఆర్టీసీ ప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్
TGSRTC online

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు సరికొత్త సేవలతో ముందుకొస్తోంది. ప్రయాణికులు, కండక్టర్ల మధ్య తరచుగా ఏర్పడే చిల్లర సమస్యలను ఎదుర్కొనేందుకు ఆర్టీసీ ఆధునిక Read more

రాష్ట్ర విభజనపై కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ex cm kiran kumar reddy

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖరరెడ్డి బతికుంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని చాలా మంది Read more

మంచిర్యాలలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..
food poisoning telangana go

తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల పరిస్థితి, ముఖ్యంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలలో ఎదురైన ఆరోగ్య సమస్యలు, తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారాయి. పలువురు విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *