అమరావతి: భారత కమ్యూనిస్టు మార్కిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా తిరిగి వి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. నెల్లూరులో 27వ ఏపీ రాష్ట్ర మహాసభలలో నూతన రాష్ట్ర కార్యదర్శిగా వి. శ్రీనివాస్ రావు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక 49 మందితో కూడిన నూతన రాష్ట్ర కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మరోవైపు 15 మందితో నూతన కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నారు.
రాష్ట్ర కమిటీ సభ్యులు వీరే :
వి. శ్రీనివాసరావు
వై. వెంకటేశ్వరరావు
సిహెచ్ బాబురావు
కె. ప్రభాకరరెడ్డి
డి.రమాదేవి
బి. తులసీదాస్
వి. వెంకటేశ్వర్లు
కె. లోకనాధం
కిల్లో సురేంద్ర
కె. సుబ్బరావమ్మ
వి.రాంభూపాల్
వి. ఉమామహేశ్వరరావు
వి. కృష్ణయ్య
దడాల సుబ్బారావు
జె. జయరాం
కె. ధనలక్ష్మీ
ఎ.వి.నాగేశ్వరరావు
ఆండ్ర మాల్యాద్ధి
యం. సూర్యారావు
వై. అచ్యుతరావు
లక్ష్మణరావు
కె. హరికిషోర్
ప్రసాద్
కె. ఉమామహేశ్వరరావు
కె. శ్రీదేవి
యం.జగ్గునాయుడు
పి. అప్పలనర్స
బి. బలరాం
ఎ రవి
వై. నర్సింహారావు
డి.వి కృష్ణ
డి. కాశీనాథ్
జి. విజయ్ కుమార్
మూలం రమేష్
డి. గౌస్ దేశాయ్
పి. నిర్మల
టి. రమేష్ కుమార్
యం. భాస్కరయ్య – రాష్ట్ర కేంద్రం
ఎ. అశోక్ – రాష్ట్ర కేంద్రం
బి కిరణ్ (ఎఎస్ఆర్ రంపచోడవరం)
వి. సావిత్రి – అనంతపురం
కె. గంగునాయుడు – పార్వతీపురం మన్యం
బి. పద్మ – విశాఖపట్నం
జి. కోటేశ్వరరావు – అనకాపల్లి
జెఎన్ వి గోపాలన్ – పశ్చిమ గోదావరి జిల్లా
మొడియం నాగమణి – ఏలూరు
వై. నేతాజీ – గుంటూరు
ఎస్.కె మాబూ – ప్రకాశం
ఒ. నల్లప్ప- అనంతపురం
కో ఆప్షన్ (నెల్లూరు)

రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా వెంకటేశ్వరరావు, బాబురావు, ప్రభాకర్ రెడ్డి, రమాదేవి, తులసీదాస్, వెంకటేశ్వర్లు, లోకనాథం, సురేంద్ర, సుబ్బరావమ్మ, రాంభూపాల్, ఉమా మహేశ్వర్ రావు, బలరాం, మూలం రమేష్, ఏవీ నాగేశ్వరరావులను ఎంపిక చేశారు. వీరిలో ఏవీ నాగేశ్వరరావు, బి.బలరాంను కొత్తగా కార్యదర్శిగా వర్గంలోకి తీసుకున్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించే పార్టీగా ఉన్న సీపీఎం.. తన ప్రజా సంఘాలతో మరింత ఉధృతంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధం అవుతోంది.