వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించాలి: కేటీఆర్‌

Education minister should be appointed immediately: KTR

హైదరాబాద్‌: తక్షణమే విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక విద్యార్థులు లేరంటూ 1864 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.

ఇదే నిజమైతే ఇంతకన్నా ఆందోళన చెందాల్సిన అంశం మరొకటి లేదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందన్నారు. టీచర్ల నియామకం, వసతుల కల్పన, నాణ్యమైన ఆహారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇలాంటి పరిస్థితులు మంచివి కావన్నారు కేటీఆర్.

ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 2024లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 2.4 లక్షలు తగ్గిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించాలని అన్నారు కేటీఆర్.