ప్రజలకు షాక్.. భారీగా పెరిగిన వంట నూనెల ధరలు

సామాన్యులకు భారీ షాక్ ఇచ్చింది కేంద్రం. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 20% పెంచడంతో వినియోగదారులపై భారం పడుతోంది. ఇప్పటికే వర్షాల దెబ్బకు కూరగాయల ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కేంద్రం దెబ్బకు వంట నూనెల ధరలు కూడా పెరిగాయి. వంటనూనెలపై దిగుమతి సుంకం (ఇంపోర్ట్ డ్యూటీ)ని పెంచుతన్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు వంటనూనెలపై దిగుమతి సుంకం లేదు. కానీ ఇప్పుడు 20% పెంచడంతో వంట నూనె ధరలు భారీగా పెరిగాయి.

అన్ని రకాల ఆయిల్స్ ధరలు లీటర్పై ఒక్కసారిగా రూ. 15-20 పెరిగాయి. పామాయిల్ రూ. 100 నుంచి రూ.115, సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.115 నుంచి రూ.130-140, వేరు శనగ నూనె రూ.155 నుంచి రూ.165కు చేరింది. పూజలకు ఉపయోగించే నూనెలనూ రూ.110 నుంచి రూ.120కి పెంచి వ్యాపారులు అమ్ముతున్నారు.