బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు

పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ఉదయం నుంచి ఆయన ఇంట్లో , బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు జరుపుతుంది. హైదరాబాద్ లోని మొత్తం మూడు ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

కాగా ఇటీవల అక్రమాలకు పాల్పడుతున్నాడని గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేసింది సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ పై మహిపాల్ రెడ్డి తమ్ముడు విడుదల అయ్యాడు. ఈయన ఇంట్లో కూడా సోదాలు జరుపుతున్నారు. అక్రమ మైనింగ్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు జరగడంతో పాటు పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో మ్మెల్యే ఫై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.