EC responded to Rahul Gandh

రాహుల్ గాంధీ ఆరోపణల పై స్పందించిన ఈసీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేసిన తెలిసిందే. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. ఈ ఆరోపణలకు సంబంధించి లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.

ఈ విషయంపై ఈసీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో స్పందిస్తూ..రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. వారి అభిప్రాయాలు, సూచనలు, ప్రశ్నలను గౌరవంతో స్వీకరిస్తాం. ఈ ఆరోపణలపై త్వరలోనే లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తాం. మహారాష్ట్ర ఓటర్లకు సంబంధించి పూర్తి వాస్తవాలు, విధానపరమైన అంశాలతో కమిషన్‌ వివరణ అందిస్తుంది అని పేర్కొంది.

image

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..లోక్‌సభ ఎన్నికల అనంతరం మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని మార్చారు.గత ఐదేళ్లలో రాష్ట్రంలో 32లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు. అంతే కాకుండా,మహారాష్ట్రలో లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికల సమయంలో 39లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు. అసలు వీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు?” అని ప్రశ్నించారు.

అదనంగా..39 లక్షల ఓటర్ల సంఖ్య హిమాచల్ ప్రదేశ్ మొత్తం ఓటర్ల సంఖ్యకు సమానం.లోక్‌సభ ఎన్నికల్లో మేము పొందిన ఓట్ల శాతం,అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం సమానంగా ఉంది.కానీ, ఎన్డీఏ కూటమి పార్టీలకు మాత్రం అదనంగా ఓట్లు వచ్చాయి.ఆఓట్ల ద్వారానే వారికి విజయం లభించింది.ఎన్నికలసంఘం మా డిమాండ్‌ను స్వీకరించి,ఓటర్ల జాబితా,వారి ఫొటోలు, చిరునామాలను అందించాలి అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Related Posts
తెలంగాణలో మూడు రోజులపాటు వైన్స్ బంద్ !
wine shops telangana

తెలంగాణలో మద్యం ప్రియులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇటీవల బీర్ల ధరలు పెంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు Read more

IPL 2025: తొలి మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ అదిరిపోయే రికార్డు
IPL 2025: తొలి మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ అదిరిపోయే రికార్డు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభ మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. కోల్‌కతా నైట్ Read more

రాజస్థాన్ విద్యుత్ శాఖతో సింగరేణి ఒప్పందం
Singareni agreement with Rajasthan Power Department

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ముందడుగు కారణంగా సింగరేణి వ్యాపార విస్తరణలో మరో కీలకమైన ఘట్టం ప్రారంభమవుతోంది. నేడు రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై Read more

నేడు పార్లమెంటుముందుకు కొత్తఐటీ బిల్లు
New IT bill before Parliame

కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లు-2025ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాన్ని సవరించి, ఆధునిక అవసరాలకు తగిన విధంగా మార్చే లక్ష్యంతో Read more