EC is an impartial system .. CEC Rajeev Kumar

ఈసీ నిష్పక్షపాతంగా ఉండే వ్యవస్థ : సీఈసీ రాజీవ్ కుమార్

ఎవరైనా తప్పు చేస్తే తమ వ్యవస్థ సహించదని వెల్లడి

న్యూఢిల్లీ: లోక్‌సభతో పాటు ఆయా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ డేటా తారుమారు అయిందంటూ కొంతకాలంగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మరోమారు స్పందించారు. పోలింగ్ డేటా వ్యవస్థ పకడ్బందీగా ఉందని, ఎటువంటి తప్పిదాలకు తావు లేదని మరోమారు స్పష్టం చేశారు. పోలింగ్‌లో అక్రమాలకు అవకాశం ఉందంటూ గతంలో వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.

image

ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యవస్థ అని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా తప్పు చేస్తే తమ వ్యవస్థ సహించదని అన్నారు. పోలింగ్ డేటా వ్యవస్థ పకడ్బందీగా ఉంటుందని స్పష్టం చేశారు. లోక్‌సభ 2024 అట్లాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ బూత్ స్థాయి అధికారులతో సహా లక్షలాది మంది సిబ్బంది పోలింగ్ డేటాలో పాలుపంచుకుంటారని, కాబట్టి పొరబాటు జరగడానికి ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈసీ విడుదల చేసిన పోలింగ్ డేటా‌లో తేడాలు ఉన్నాయని ఇటీవల విపక్షాల నుంచి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

Related Posts
నవంబర్ 26న పార్లమెంట్ ఉభయసభల ప్రత్యేక సమావేశం
A special meeting of both houses of Parliament on November 26

న్యూఢిల్లీ: నవంబర్‌ 26న పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక సమావేశానికి సిద్ధమవుతున్నాయి. రాజ్యాంగానికి ఆమోదం ఇచ్చిన సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో నవంబర్ 26న ఈ Read more

ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్..త్వరలోనే గజ్వేల్లో భారీ సభ!
kcr

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇంటికే పరిమితమైన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) మళ్లీ Read more

అనుమతులు లేని లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేయకండి – హైడ్రా
Commissioner Ranganath received Hydra complaints.

లేఔట్లలో ప్లాట్లను కొనుగోలు చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు హైదరాబాద్ నగరంలో, అలాగే పరిసర ప్రాంతాల్లో అనుమతులు లేని లేఔట్లలో ప్లాట్లను కొనుగోలు చేయవద్దని హైడ్రా Read more

అత్తా కోడళ్లు డిశ్యుమ్ డిశ్యుమ్
అత్తా కోడళ్లు డిశ్యుమ్ డిశ్యుమ్

అత్తాకోడళ్ల గొడవలు ఇంట్లోనే పరిష్కారం చేసుకుంటే సరిపోతుంది. కానీ కొన్ని సార్లు ఈ గొడవలు రోడ్డెక్కి పెద్ద సమస్యగా మారతాయి. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ అత్తాకోడళ్ల గొడవ Read more