earthquakes prakasam distri

ముండ్లమూరులో వరుసగా భూప్రకంపనలు

ప్రకాశం జిల్లా ముండ్లమూరులో వరుసగా మూడు రోజులుగా భూ ప్రకంపనలు రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. శనివారం ఉదయం మొదలైన ప్రకంపనలు ఆదివారం, సోమవారం వరకు కొనసాగాయి. సోమవారం ఉదయం 10.24 గంటలకు వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 1.8గా నమోదైంది. రాత్రి మరో రెండు సార్లు భూకంపాలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భూకంపాల తీవ్రత వల్ల ముండ్లమూరు మోడల్ స్కూల్ భవనం పాక్షికంగా దెబ్బతింది. భవనం భద్రంగా లేదని విద్యార్థులు తరగతులకు హాజరు కావడం లేదు. దీంతో స్కూల్ టీచర్లు చెట్ల కింద తరగతులను నిర్వహిస్తున్నారు. ఇలా వరుస భూకంపాలపై శాస్త్రవేత్త రాఘవన్ మాట్లాడుతూ.. వరుస భూకంపాలపై పరిశోధనలు అవసరమని సూచించారు. ముండ్లమూరు ప్రాంతంలో భూప్రకంపనలు హైడ్రోశాస్మసిటీ కారణంగా వచ్చిన అవకాశముందని తెలిపారు. రిజర్వాయర్లు, గుండ్లకమ్మ నది వంటి ప్రాంతాల్లో లోతైన అధ్యయనం చేయాలని అభిప్రాయపడ్డారు.

తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. భూకంపాల కారణంగా ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. కలెక్టరేట్‌కు నివేదికలు పంపించామని, ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Related Posts
మహిళా ఎస్సైపై యువకుల దాడి..చివరికి ఏమైంది?
గుడివాడలో మహిళా ఎస్సైపై దాడి.. పోలీసులు ఏం చేశారు?

విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి వేణుగోపాలస్వామి జాతర సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సంప్రదాయంగా ప్రతి ఏటా నిర్వహించే ఈ జాతరలో డాన్స్‌ Read more

పెత్తందార్లం కాదు.. ప్రజాసేవకులం
img3

-- రెండవ జిల్లాల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, డిసెంబర్ 11 : రాష్ట్రంలో ప్రతి అధికారి పెత్తందారులా కాకుండా ప్రజాసేవకుడిలా పనిచేయాలని, ‘పీపుల్ ఫస్ట్’ Read more

ఇండస్ట్రీలో విషాదం సినీ డైరెక్టర్ మృతి
ఇండస్ట్రీలో విషాదం సినీ డైరెక్టర్ మృతి

మలయాళ సినిమా పరిశ్రమకు ఈ రోజు ఒక పెద్ద శోకం మిగిలింది. ప్రముఖ దర్శకుడు షఫీ (56) గుండెపోటుతో ఆప్తుల నుండి విడిపోయి, ఆదివారం కన్నుమూశారు. ఈ Read more

నేడు స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ లాంచ్
Swarnandhra 2047

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. విజయవాడలో జరగనున్న ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర Read more