earthquakes prakasam distri

ముండ్లమూరులో వరుసగా భూప్రకంపనలు

ప్రకాశం జిల్లా ముండ్లమూరులో వరుసగా మూడు రోజులుగా భూ ప్రకంపనలు రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. శనివారం ఉదయం మొదలైన ప్రకంపనలు ఆదివారం, సోమవారం వరకు కొనసాగాయి. సోమవారం ఉదయం 10.24 గంటలకు వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 1.8గా నమోదైంది. రాత్రి మరో రెండు సార్లు భూకంపాలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భూకంపాల తీవ్రత వల్ల ముండ్లమూరు మోడల్ స్కూల్ భవనం పాక్షికంగా దెబ్బతింది. భవనం భద్రంగా లేదని విద్యార్థులు తరగతులకు హాజరు కావడం లేదు. దీంతో స్కూల్ టీచర్లు చెట్ల కింద తరగతులను నిర్వహిస్తున్నారు. ఇలా వరుస భూకంపాలపై శాస్త్రవేత్త రాఘవన్ మాట్లాడుతూ.. వరుస భూకంపాలపై పరిశోధనలు అవసరమని సూచించారు. ముండ్లమూరు ప్రాంతంలో భూప్రకంపనలు హైడ్రోశాస్మసిటీ కారణంగా వచ్చిన అవకాశముందని తెలిపారు. రిజర్వాయర్లు, గుండ్లకమ్మ నది వంటి ప్రాంతాల్లో లోతైన అధ్యయనం చేయాలని అభిప్రాయపడ్డారు.

తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. భూకంపాల కారణంగా ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. కలెక్టరేట్‌కు నివేదికలు పంపించామని, ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Related Posts
గ్లోబలైజేషన్ పై ట్రంప్ గెలుపు ప్రభావం: జైశంకర్ విశ్లేషణ
1695537685 new project 45

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గెలుపు తర్వాత ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ (మానవుల, వస్తువులు, సేవలు మరియు ఆలోచనలు దేశాల మధ్య స్వేచ్ఛగా మార్పిడి) పై ఎలాంటి ప్రభావాలు ఉంటాయి Read more

నయనతారకి లీగల్ నోటీసులు!
నయనతారకి లీగల్ నోటీసులు!

ప్రముఖ "లేడీ సూపర్ స్టార్" నయనతార ప్రస్తుతం వివాహ డాక్యుమెంటరీ "నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్" విడుదలైన తర్వాత వివిధ సమస్యల్లో చిక్కుకున్నారు. ఈ డాక్యుమెంటరీ Read more

ఏపీ సీఎంతో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ
NITI Aayog Vice Chairman meets AP CM

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ భేరీ నేతృత్వంలోని బృందం ఈరోజు సమావేశమైంది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర Read more

ఒహియో గవర్నర్ పోటీలో వివేక్ రామస్వామి
ఒహియో గవర్నర్ పోటీలో వివేక్ రామస్వామి

వైట్ హౌస్‌లో కొత్త ప్రభుత్వ సామర్థ్య కార్యాలయానికి నాయకత్వం వహించడానికి ఎంపికైన వివేక్ రామస్వామి, ఇప్పుడు ఒహియో గవర్నర్ పదవికి పోటీ చేయడానికి వారు సిద్ధమవుతున్నారు. అందుకే, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *