డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్

ఏపీలో అధికారం చేపట్టిన కూటమి సర్కార్..రాష్ట్ర ప్రజలకు వరుస గుడ్ న్యూస్ అందిస్తూ వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంది. ఇప్పటికే అనేక వర్గాలవారికి తీపి కబురు అందించిన చంద్రబాబు..తాజాగా రాష్ట్రంలోని SC, ST వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించి వారిలో ఆనందం నింపారు. ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం ఇవ్వనుంది. దీన్ని వారు వాయిదాల రూపంలో చెల్లించాలి. 2024-25 ఏడాదికిగానూ రూ.250 కోట్లు రుణంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సంబంధిత ఫైల్పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేశారు.

డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నెలలో యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో గ్రామ సంఘం స్థాయి నుంచి అన్ని దశల్లోనూ పర్యవేక్షణ ఉంటుంది. అలాగే లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న జీవనోపాధికి అనుగుణంగా రుణ మంజూరు చేస్తారు. ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలనేది డ్వాక్రా మహిళల ఇష్టం.