దువ్వాడ శ్రీను ఇంటి వద్ద భార్య, కూతురు ఆందోళన

టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను వివాదం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను క్రొత్త ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను క్రొత్త ఇంటి తలుపులు భార్యవాణి , కూతురు హైందవి, బంధువులు…పగలగొట్టారు. గత రెండేళ్లుగా దువ్వాడ కుటుంబంలో విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో వేరు వేరుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య జేడ్పీటీసీ దువ్వాడ వాణి ఉంటున్నారు.

ఈ క్రమంలో రెండు రోజులుగా దువ్వాడ భార్య , కూతుర్లు ఆందోళన మొదలుపెట్టారు. శుక్రవారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఉద్రిక్తత కొనసాగింది. పెద్ద కుమార్తె హైందవి‌తో కలిసి దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణి వచ్చారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వాణి, హైందవిలు లోనికి ప్రవేశించారు. బయట నుంచి వచ్చిన శ్రీనివాస్ ఒక్క సారిగా భార్యాకూతురిని చూసి చిందులు తొక్కారు. భార్యా కూతురిని చంపేస్తాను అంటూ గ్రానైట్ రాయి పట్టుకుని వారిపైకి దూసుకెళ్లారు. పోలీసులు ఆయనను అదుపు చేశారు. ఈ క్రమంలోనే భార్యాకూతురితో దువ్వాడ వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలబోమని ఇంటి లోపల వాణి, హైందవిలు బైఠాయించారు.

హైందవి మాట్లాడుతూ.. తన తండ్రిని కలిసేందుకు గురువారం అర్ధరాత్రి 2 గంటల వరకు వేచి ఉన్నప్పటికీ స్పందన లేదన్నారు. ఒక మహిళ కారణంగా తమ తండ్రి తమకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని వెల్లడించారు. ఇక ఈ వ్యవహారంలోఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురి కూడా శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయ లబ్ది కోసమే వాణి తనను ట్రాప్ చేసిందని ఆరోపించారు. శ్రీను తనను ఎప్పుడూ రాజకీయాల్లోకిగానీ.. ఇతర కార్యక్రమాల్లోకి పిలవలేదని తెలిపారు. పార్టీలో చురుగ్గా ఉండాలని.. వాణి పిలిచి మహిళా అధ్యక్ష పదవి ఇచ్చారనాన్నరు. వాణి చేస్తున్న ప్రచారం కారణంగానే తాము స్నేహితుల్లా ఉంటున్నామని మాధురి తెలిపారు.