school holidays in august 2 jpg

ఏపీలో ఈనెల 3 నుంచి దసరా సెలవులు!

Dussehra holidays in AP from 3rd of this month!
Dussehra holidays in AP from 3rd of this month!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏపీలో దసరా సెలవులను ఫైనల్ చేస్తూ… కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల మూడవ తేదీ నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు.. వెల్లడించింది. ఈ నెల 3 నుంచి… అక్టోబర్ 14వ తేదీ వరకు.. ఏపీలోని విద్యాసంస్థలకు… దసరా హాలిడేస్ ఉండనున్నాయి. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలకు… చంద్రబాబు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దసరా సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక క్లాసులు నిర్వహించకూడదని కూడా పేర్కొంది. ఒకవేళ పదో తరగతి స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

కాగా, వాస్తవానికి రాష్ట్రంలో అక్టోబరు 4 నుంచి 13 వరకు సెలవులు ఇవ్వాలని ముందు నిర్ణయించారు. అయితే, తెలంగాణలో అక్టోబరు 3 నుంచే ఇస్తున్నారన్న విషయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించిన లోకేశ్… అక్టోబరు 3 నుంచే దసరా సెలవుల ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. తద్వారా ఏపీలో విద్యార్థులకు 12 రోజులు సెలవులు లభించనున్నాయి. అక్టోబరు 2న గాంధీ జయంతి కాగా… ఆ రోజుతో కూడా కలుపుకుంటే అక్టోబరు 13 వరకు మొత్తం 12 రోజులు సెలవులు వస్తాయి

Related Posts
రూ .2.98 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్..
Assembly meeting from today. Cabinet approves AP budget

అమరావతి: ఈరోజు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జె‌ను ప్రవేశపెట్టనున్నారు. సుమారు రూ. 2.9 లక్షల కోట్లతో Read more

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి పెరుగుతున్న కాంగ్రెస్‌ సీనియర్ల మద్దతు
MLC Jeevan Reddy has growing support from Congress seniors

హైదరాబాద్‌: జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి పార్టీ సీనియర్‌ నేతల నుంచి మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్‌ నాయకుడు జీవన్‌రెడ్డికి అనుచరుడు Read more

‘గేమ్ ఛేంజర్’ థియేటర్ల యాజమాన్యాలకు పోలీసుల సూచనలు
'Game changer' police instr

పుష్ప-2 విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన తర్వాత, రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా విడుదల Read more

ఉక్రెయిన్‌కు ATACMS క్షిపణులు: రష్యా యుద్ధంలో అమెరికా జోక్యం పెరుగుతుంది
atacmc

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న పరిస్థితుల్లో, అమెరికా ఉక్రెయిన్‌కు దీర్ఘ పరిధి క్షిపణులను (ATACMS) ఉపయోగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్షిపణులు రష్యా భూభాగంలో లోతుగా ఉన్న లక్ష్యాలను Read more