DSP : రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్న ‘షష్టిపూర్తి’ విడుదలకు సిద్ధం సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘షష్టిపూర్తి’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ కుటుంబ కథా చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించగా, తాజాగా ‘ఏదో ఏ జన్మలోడో’ అనే పాటను విడుదల చేశారు. ఇళయరాజా మ్యూజిక్ – కీరవాణి సాహిత్యం!ఈ పాట విశేషం ఏమిటంటే, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి స్వయంగా లిరిక్స్ రాయడం. ఇళయరాజా స్వరపరిచిన పాటకు కీరవాణి సాహిత్యం అందించడం ఇదే మొదటిసారి కావడంతో సంగీత ప్రియుల్లో ప్రత్యేక ఆసక్తిని రేపుతోంది.ఇకపోతే, ఈ మ్యూజికల్ ట్రాక్‌ను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) అధికారికంగా లాంచ్ చేశారు.

‘ఏదో ఏ జన్మలోడో’ పాటలో రూపేష్, ఆకాంక్ష సింగ్ జంటగా కనిపించనున్నారు.పాటపై దర్శకుడు పవన్ ప్రభా స్పందన ఈ పాట గురించి మాట్లాడుతూ దర్శకుడు పవన్ ప్రభా మాట్లాడుతూ,”ఇళయరాజా గారి మ్యూజిక్, కీరవాణి గారి సాహిత్యం, అనన్య భట్ గారి ఆవేశభరిత గాత్రం – ఇవన్నీ కలిసొచ్చి అద్భుతమైన పాటగా మలిచాయి” అని తెలిపారు. షష్టిపూర్తి కథలో ఎవరెవరు? ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌తో పాటు అర్చనా, రూపేష్, ఆకాంక్ష సింగ్, అచ్యుత్ కుమార్, తెనాలి శకుంతల వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కుటుంబ బంధాలను హృద్యంగా ఆవిష్కరించే ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేలా ఉంటుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.‘షష్టిపూర్తి’ చిత్రం త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది!